(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: చాలా చిన్న సమాధానం ఏమిటంటే, నిరభ్యంతరంగా, నిస్సందేహంగా ఏ మాత్రం రెండవ తలంపుకు ఆస్కారం లేకుండా వారందరు నీటి బాప్తిస్మము పొందవచ్చు. అభ్యంతరము లేదు. వేరే వాళ్ళు ఎవరైన బాప్తిస్మము ఇవ్వకపోతే నేను ఇస్తాను. నా దగ్గరకు రమ్మని చెప్పండి. ఆయనకు బాప్తిస్మము ఇవ్వడానికి ఏ మాత్రం ఆటంకం లేదు. ఇలాంటివారు అరబ్బు కంట్రీకి వెళ్ళి ఎలా సువార్త చెప్తారు? అక్కడ ఒక్కొకరికి ఇద్దరు ముగ్గురు భార్యలుంటారు. ఒక విషయం ఏమిటంటే ఆదాము కొరకు దేవుడు ఒక హవ్వనే చేసాడు గానీ, నలుగురైదుగురు హవ్వలను చేయలేదు. గనుక ఒక పురుషుడికి ఒక భార్య ఉండాలి. అని దేవుని ప్రణాళిక కానీ, ఆ తరువాత కాలంలో పాపం ప్రవేశించిన తరువాత సమాజిక స్థితి గతులు మారినందుకు బహుభార్యత్వం అనేది సమాజంలో ప్రవేశించింది. ఈ బహు భార్యత్వం అనేది దేవుడికి ఇష్టంలేదు. ఇది ఎవరు కాదనలేని పాయింట్, కానీ రక్షణపొందక ముందు చేసిన తప్పులలో రెండు రకాల తప్పులు ఉంటాయి. తప్పులలో దిద్దుకోడానికి అవకాశం ఉన్న తప్పులు కొన్ని, దిద్దుకోవడానికి అవకాశం లేనటువంటి తప్పులు కొన్ని. జక్కయ్య అన్నాడు “ఎవరిదగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే వాడికి నాలుగింతలు వెంటనే తిరిగి ఇచ్చేస్తాను అని. కొన్ని తప్పులు దిద్దుకోవడానికి అవకాశం లేదు. రక్షణ పొందే ముందు దిద్దుకోవడానికి అవకాశం ఉన్న తప్పులను గూర్చి పశ్చాత్తాపపడాలి. అన్నింటి గూర్చి మారు మనస్సు పొందాలి. దిద్దుకోవడానికి అవకాశం లేనటువంటి తప్పులలో ఒకటి బహుభార్యత్వం. కాబట్టి దేవుని కృపకు అందించి బాప్తిస్మాన్ని పొందవచ్చు. రక్షణపొందకముందు అజ్ఞానంతో చేసారు గనుక దేవుని కృపచేత క్షమిస్తాడు. అలాంటి ఇద్దరు, ముగ్గురూ భార్యలు ఉన్నవారు రక్షణపొందిన ఆదిమ సంఘాల్లో, పౌలు నాటిన సంఘాల్లో చాలా మంది ఉన్నారు. సేవకులందరికి తెలియజేయునది ఏమనగా వారిని మునపటి తప్పును అడ్డం పెట్టుకొని రక్షణ ఇవ్వకుండా దేవునికి దూరం చేయడం తప్పు. ఇది దేవుని నడిపింపు కింద రంజిత్ ఓఫీర్ ఇస్తున్న దేవోక్తి.