(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: యేసు ప్రభు యొక్క Status, Original identity ఏమిటో మీకు తెలియాలంటే, మీరు తప్పకుండా నా “పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం” అనే గ్రంథం చదవాలి. యేసు ప్రభు వారు నిత్యుడు అని అర్ధం వచ్చే మాటలు బైబిల్లో చాలా ఉన్నాయి. “ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవుడైయుండెను. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. సమస్తము ఆయన మూలంగా కలిగెను” అని, హెబ్రీ 7:1, లో మెల్కీసెదకు దేవుని కుమారుని పోలి ఉన్నాడని చెప్పడానికి “ఆయనకు తండ్రిలేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలానికి ఆరంభం, జీవనమునకు అంతమైనను లేని దేవుని కుమారుని పోలి ఉన్నాడు” అని చెప్తాడు. అంటే ఈ ఐదు (5) లేకపోవడం దేవుని కుమారుని లక్షణం. గనుక యేసు ప్రభు వారు పుట్టుక, చావు లేకుండా నిరంతరం ఉన్నవాడు. అయితే సామెతలు 8:22లో “కలుగజేసేను” అని చెప్పబడింది. యోహాను 5:26లో తండ్రి నాకు “అధికారము అనుగ్రహించెను” అన్నాడు. అంటే ఆయన పరలోకంలో ఉండగానే ఆయన తన్నుతాను second position లోనికి తగ్గించుకున్నాడు, దేవదూతలలో ఒకడుగా ఎంచబడ్డాడు. దేవునిలోని ఒక భాగమే గాని, ఆయన దేవతూతలలో ఒకడుగా ఎంచబడ్డాడు, అనే deep mystery ని scriptural proofs తో “పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం” అనే గ్రంథంలో నిరూపించాను. Definitely Jesus Christ is God, who never had a beginning nor never will have an end”. “He is eternally co-existant with God the father”
దేవకుమారుని ఉనికికి మొదలు అనేది లేనేలేదు. మరి కలుగజేయడం, అధికారం పొందడం అంటే ఏమిటో, నా గ్రంథంలో చెప్పాను దయచేసి చదవండి.