226. ప్రశ్న : లూకా సువార్తలో యేసు ప్రభువారు “దేవుని రాజ్యం మీ మధ్యలోనికి వచ్చియున్నది అని, ఒకసారి రాబోతుంది అని అంటాడు. దాని అర్థం ఏమిటి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:      దేవుని రాజ్యం భౌతిక ప్రపంచంలో సంపూర్ణంగా నడుస్తుంటే ఈ హత్యలూ, మానభంగాలు, ఇవన్నీ దేవుడే జరిగిస్తున్నాడు అనుకోవాల్సి వస్తుంది.  కానీ దేవుని రాజ్యంలో హత్యలు, మానభంగాలు, accidents, అసత్య దేవతల ఆరాధన ఉండవు.  గనుక దేవుడు fulfledged గా ఈ లోకాన్ని ఏలుతున్న దశ ఇప్పుడు రాలేదు.  కానీ విశ్వసిస్తున్నవారి హృదయాలలో మాత్రం యేసు రాజే.  విశ్వాసుల హృదయాలలో దేవుని రాజ్యం వచ్చింది.  క్రైస్తవ కుటుంబాలలో, క్రైస్తవ సంఘాలలో దేవుని రాజ్యం వచ్చింది. కానీ political గా యేసుప్రభు ఏలే రోజు ఇంకా రాలేదు. ప్రతీ పౌరుణ్ణి, అందరినీ కలిపి పరిపాలించే political power ఇంకా యేసు ప్రభు చేపట్టలేదు. రెండవ రాకడలో political చేపడతాడు. ఇప్పుడు ఎలా భారతదేశానికి ప్రధానమంత్రి, అమెరికాకు అధ్యక్షుడు ఉన్నాడో, ప్రపంచమంతటిని ఏలే ప్రభుత్వం యొక్క సర్వోన్నత అధినేత యేసుక్రీస్తు భౌతికంగా కనిపిస్తూ భూమ్మిద ఉండి 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు.  ఆ రాజ్యం రాలేదు. దానికోసమే “నీ రాజ్యం వచ్చునుగాక” అని ప్రార్ధన చేయమన్నాడు.  Political గా మాత్రం ఆయన రాజ్యం రాలేదు.  విశ్వసిస్తున్న వారి యొక్క హృదయాలలో మాత్రం ఆయన రాజ్యం వచ్చింది.  ఇదీ అర్థం.