229. ప్రశ్న : ప్రార్థనలో ఏకాగ్రత సాధించాలి అంటే ఏమి చేయాలి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:      ప్రార్థనలో ఏకాగ్రత సాధించాలనే ఆశ ఉంటే ఏకాగ్రత తప్పకుండా వస్తుంది Repeated గా ప్రయత్నం చేస్తా ఉండాలి.  బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు “ముంగమూరి దేవదాస్” అయ్యగారు ప్రార్ధనలో ఏడు మెట్లు అని ఆయన నేర్పించారు. ప్రార్థన మనం అక్కడక్కడ తిరిగి, అన్ని పనులు చేసుకొని, అందరీతో మాట్లాడి గదిలోకి వెళ్ళి చటుక్కన మోకరించి మన మనస్సులో ఉండే ప్రార్థనలు ఆయనకు హడావిడిగా విన్నవించుకోవడం అనేది సరైన పద్ధతి కాదు.  ఆయన ఏమి చెప్పారు అంటే. ముందు మనో నిధానం అనే మెట్టు మీద ఉండాలి. అది ఒక్కోక్కవ్యక్తి ఒక్కొక్క టైమ్ పట్టవచ్చు కానీ మనోనిధానం రాకముందు ఇంకోక step వేయొద్దు. నేను మంచి, చెడు, గతం, భవిష్యత్తు గూర్చిన ఆలోచనలు అన్నీ మరిచిపోయి మన మనోనేత్రాలతో దేవుడిని చూడడానికి కొంత సేపు ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏవేవో జ్ఞాపకం వస్తాయి.  అవి వస్తూ ఉన్న కొలది వాటిని ప్రక్కకి నెట్టివేయాలి. మనస్సు వేరే వైపు divert ఐతే అది గ్రహించగానే మళ్లీ మనస్సు దేవుని వైపు తిప్పాలి. ఇలా చేస్తూ ఉంటే కొంత సమయం అయినాక ఈ తలంపులు అటూ ఇటూ వెళ్లడం తగ్గిపోతుంది. అది ఒక రోజు ఒక్క నిమిషానికి దేవునివైపు divert అవుతాం, ఇంకొ రోజు ఇంకొంత సేపటికి అవుతాం అలా Regular గా practice చేయడం వల్ల పరిశుద్ధాత్మ దేవుడు కూడా సహాయం చేస్తాడు.  దాని ద్వారా ఏకాగ్రత వస్తుంది.