(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: అసలు రెండంతల ఆత్మ ఎందుకు అనేది ఒక ప్రశ్న? అసలు ఒకంత ఆత్మ వచ్చిందా? వచ్చినాకా ఏమి ప్రయోజనం అయింది? ఏరీతిగా ప్రభు కొరకు ఫలించారు? అక్కడ ఏలియా కాలంలో ఏలియా శిష్యుడైనా ఎలీషా అడిగినటువంటి మనవి అది. ఏలియా ఆరోహణం చేయబడతాడు అనే రోజు దగ్గరికి వచ్చినప్పుడు, విడువకుండా ఆయన వెంట అంటుకుని తిరుగుతూ ఉన్నాడు ఎలీషా. ఈ ఊరిలో ఉండిపో బాబు నాకు పొరుగూరిలో పనుంది. అక్కడ నుండి ఎత్త బడదాం అని ఏలియా Plan. నాజీవము తోడు, నీ జీవము తోడు నిన్ను వదిలిపెట్టేది లేదని చెప్పి వెంటబడి తిరుగుతుంటే విసుగొచ్చి ఏలియా అన్నాడు. ఈయన నా మాట వినేటట్టు లేడు. ఏమి ఆశించి నా దగ్గరికొస్తున్నావు? వెంబడిస్తున్నావు? నేను తీయబడకముందు ఏమి కావాలో అడుగు అంటాడు! అప్పుడు – నీకు కలిగిన ఆత్మలో రెండు పాలు నాకు దయచేయుము అని అన్నాడు. నీవడిగింది కష్టతరంగా ఉంది. అది యియ్యవల్సింది దేవుడే గాని నేను గాను గదా! సరే నేను నీ నుండి తీయబడునప్పుడు, నేను నీకు కనబడితే నీ కళ్ళ ముందే నా ఆరోహణం జరిగితే, అప్పుడు నీకది వస్తుంది అని అన్నాడు. గనుక అక్కడేంటంటే, ఏలియా సత్యము కొరకు ధ్వజము నెత్తిన ఒక సైనికుడు. ఇశ్రాయేలీయులు భ్రష్టమైపోతున్న ఒక తరము అది. ఎప్పుడైతే ఏలియా కాలంలో ఆహాబు కార్యాలు, యెజెబెలు కార్యాలు, ఇశ్రాయేలును మొత్తం భ్రష్టుపట్టించేసినయో ఏలియా యొక్క ప్రార్థన ద్వారా ఎప్పుడైతే అగ్ని దిగివచ్చి అందరు సత్యం గ్రహించారో అప్పటి ఆ బీజం, విత్తనం మనస్సులో నుంచి ఎక్కడికి పోతుంది? యెజెబెలు ఇంకా బ్రతికి ఉంది. ఆహాబు యొక్క విత్తనం సంతానం అతని అనుచరులు, దురాత్మలు, ఇశ్రాయేలులో ఉన్న ఆ అల్పవిశ్వాసం, తడబాటు వీటన్నిటిని ఎదుర్కొడానికి ఎలీషాకు ఇంకా బలమైన పోరాటం ఉన్నది అని Expect చేసాడు. గనుక నీకంటే నాకు Double portion of the spirit కావాలి అన్నాడు. గనుక మొట్టమొదట మామూలు భక్తులకున్నటువంటి ఆత్మ శక్తి కంటే నాకు Double కావాలి అని ఎవరైనా అడగాలంటే – ఒట్టిగానే Crusade లలో Suit వేసుకొని Photo వేసుకోవడం కొరకు కాదది. ఇప్పుడు మామూలు ఆత్మ ఉన్నా వాడు చేసే పోరాటం కంటే నేను Double tough battle కఠినమైన యుద్ధం ఉన్నది. అనే పరిస్థితి ఉంటే అప్పుడు మనం అడగాలి, దేవుడు తప్పకుండా ఇస్తాడు.