(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: పరిశుద్ధత అంటే దాని Ultimate defination ఏమిటంటే దేవుని వంటి స్వభావము కలిగియుండటమే పరిశుద్ధత. మానవకోణంలో నుండి చూస్తే మనుషులకు సిగ్గరెట్లు, త్రాగుడు ఇలాంటి వ్యసనాలు, స్త్రీలోలత్వం, కాముకత్వం ఇలాంటివి లేకుండా ఉండాలి. పరిశుద్ధుడుగా నేను జీవించాలి అంటే ఒక నిర్వచనం ఏమిటంటే సిగరెట్టు తాగుతున్నాను, అది మానివేయడం పరిశుద్ధత. ఇలాంటి ఇతర వ్యసనాలు మానేయడం పరిశుద్ధత అంటే ఇవన్నీ మానేసిన తర్వాత కూడా ఇంకా దేవుని ముందు నేను యోగ్యుడిని కాను అనే భావన కలుగుతుంది. కాముకత్వం, మనస్సులో కూడా లైంగికత్వం అంగీకరించను అనే అంత మానసిక పరిశుద్దత సాధించినా ఇంకా కూడా దేవుని దగ్గర నేను యోగ్యుడిని కాదు అనిపిస్తుంది. మరి పరిశుద్దత అంటే మానవుడు ఎప్పుడు యోగ్యుడుగా feel అవుతాడు? అంటే ఇవన్నీ కూడా మానుకున్నంత మాత్రానా దేవుని ముందు ఆ confidence రాదు. ఎందుకంటే కెరూబు, సెరాఫులకే రాలేదు గనుక. సంపూర్ణ సర్వోన్నత ఏదైతే దేవుడిలో ఉన్నదో ఆ పరిశుద్ధత ముందు మిగిలిన వన్నీ అపవిత్రమే. గనుక దేవుని ముందు పరిశుద్ధులముగా feel అవ్వాలి, ఆ ఆత్మ నిశ్చయత రావాలి అంటే దేవునిలో ఉన్న పరిపూర్ణ పరిపక్వ పరిశుద్ధత మనకు రావాలి. అప్పుడు మనం ధైర్యంగా ఆయన ముందు నిలువగలం. మరి అంతటి పరిపూర్ణత కెరూబులు, సెరాపులకే రానప్పుడు ఆదాము కొడుకులం, కూతుర్లం మనకెలా వస్తుంది? గనుకది సాధ్యం కాదు. అందుచేత అంతటి పరిశుద్ధత కలిగిన యేసుని మనమీద కవచంగా ధరించుకోవాలి. 1కొరింథీ 1:31లో “ఆయన మూలముగా క్రీస్తు యేసు మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనము ఆయెను” Jesus became our holiness. యేసును మనం తొడుగుకుంటే దేవుని ముందుకు వెళ్లి నిలువబడినప్పుడు సింహాసనం మీద ఉన్న దేవుడు ఎంత పరిశుద్ధుడో ఇతడు కూడా అంతే పరిశుద్దుడు అనే Judgement వస్తుంది. పరలోకంలో గనుక పరిశుద్ధత అంటే యేసును ధరించుకోవడం. పరిశుద్ధాత్మ యేసులాగా మనం మారాలనే ప్రయత్నం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. కానీ దేవుని ముందు పరీక్ష నెగ్గాలంటే మాత్రం క్రీస్తును తొడుగుకోవాలి. తొడుగుకున్న యేసు అనే కవచాన్ని బట్టి మనం పరీక్ష నెగ్గుతాం కానీ మనంతట మనం నెగ్గలేం.