(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: చెడ్డ కండ్లు అనేది బైబిల్లో లో కూడా చెప్పబడ్డాయి. కొంతమంది మనస్సులో ఉండే Negative శక్తి (అవి కూడా పడిపోయినా దేవదూతల ప్రభావం వల్లనే) కొంతమంది మనుష్యులలో అవి ఆవహించి ఎదురుగా ఉన్న మనిషి పచ్చగా ఉంటే వీడు సహించలేడు. వాళ్లకి ఎందుకు ఇంత మంచి ఇల్లు, పిల్లలు…. అని వీళ్లు అనుకుంటూ ఉంటారు. ఆ Negative thoughts అన్ని సైతాను వాడి లోపలికి పంపిస్తాడు. అయితే ఆ కనుచూపు ఎదుటి వారి మీద పడినప్పుడు వెంటనే వాళ్ల మానసిక వాతావరణంలో మార్పు రావడం, కంగారు కలగడం అలాంటి effects తప్పకుండా ఉంటాయి. దిష్టి అంటే అవతలి వాళ్ల Mental Negative Energy కనుచూపుల ద్వారా వాళ్లకు తాకడం. గానీ దిష్టిని తొలగించాలంటే మన దేశంలో ఏంటంటే చీపురుకట్ట తీసుకొచ్చి తిప్పాలి, ఎండు మిర్చి, ఉప్పు తెచ్చి తూ! తూ! అని ఉమ్మేసి పడవేయాలని మన వాళ్ల పద్దతి. కాని క్రైస్తవులమైన మనం ఏమిటంటే ఈ చెడ్డవాళ్ల Mental negative energy మనకు వచ్చినా, ఇంకా ఏ రకంగా ఏ కీడు వచ్చినా అన్నింటికి మనకున్న పరిష్కారం, కవచం యేసు రక్తం. ఈ చెప్పులు, చీపిరి కట్ట మనకు అవసరం లేదు. వాటికున్న power కంటే కోట్లకోట్లు ఎక్కువ శక్తి యేసు రక్తంలో ఉంది. దిష్టి తీయడం లాంటివి మనకు అవసరం లేదు కానీ దాన్ని గురుతుపట్టాలి. నా మీద ఎవరి చెడు దృష్టి పడిందో గనుక “యేసయ్యా నీ రక్తం నా మీద ప్రోక్షించి, ఆ దుష్ట ప్రభావాన్ని కడగమని” ప్రభుని ప్రార్థించాలి.