237.  ప్రశ్న : మీరు “హైందవ క్రైస్తవం” గ్రంథంలో రామతత్వం, శివతత్వం, విష్ణుతత్వం. ఈ మూడు కలిసినది యేసు తత్వం అని చెప్పారు. అయితే రాముడిలో యేసు తత్వం ఉంటే రాముడు పరలోకానికి వస్తాడా? కృష్ణుడు పరలోకానికి వస్తాడా?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:      నేనైతే రాముడు పరలోకంలో ఉంటాడనే నమ్ముతున్నాను. ఎందుకంటే రాముడు రామాయణంలో ఒక్కసారి కూడా నేను దేవుడను నన్ను ఆరాధించండి అని చెప్పలేదు. నేను మీ పాపములను క్షమిస్తాను అని చెప్పలేదు. ఆయనొక మంచి, నీతిగలిగిన రాజు. ఆ రోజుల్లో బలి కర్మకాండ అమలులో ఉండేది. బలికర్మకాండ ఎందుకు ఉంటుంది అంటే సర్వపాప పరిహారార్థం రక్తప్రోక్షణం అవసరం అని నమ్మకం ఉన్నది గనుకనే యజ్ఞాలు చేసారు. గనుక వేరు మనుషులెవరో ఆయన చెప్పని దాన్ని ఆపాదించి చెప్పడం ఆయన తప్పుకాదు. బుద్ధుడు కూడా నేను దేవుడిని, నన్ను ఆరాధించండి అని చెప్పలేదు. ఆయన ఉన్నంతలో నీతిగా బ్రతికాడు. ఒకవేళ అవతార పురుషులు అనిపించుకుంటున్న వీరిలో చాలామంది పరలోకంలో యేసు ప్రభుని రక్తం చేత విమోచింపబడిన ధన్యజీవుల గుంపులో ఉంటే ఆశ్చర్యం ఏమిలేదు. వారు ఉంటారనే నా విశ్వాసం.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram