238. ప్రశ్న : సంఘాలలో లేదా బహిరంగంగా ఆరాదన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని, ఆహ్వానించేటప్పుడు High Speed లో పాట పాడడం, Music వాడడం జరిగితేనే దేవుడు మన మీదికి దిగివస్తాడా? ఆయనను ఆహ్వానించే విధానం ఏమిటి? గట్టిగా ఆరాధించడం వల్ల విమర్శకులకు chance ఇచ్చినట్లు అవుతుంది కదా!

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:      పరిశుద్దాత్మ దేవుడు High Speed, Low Speed అనే దాన్ని బట్టి రాడు, మనం హృదయం లోని యదార్థతను బట్టి వస్తాడు. ఎంత చిత్తశుద్ధి, యదార్థత, ఆకలి, దాహంతో అడుగుతున్నామో ఎంత విధేయత కలిగి యున్నామో దాన్ని బట్టి ఆయన వస్తాడు. మన హృదయంలో యదార్థత లేకుండా ఎంత గట్టిగా, fast గా పాట పాడినా రాడు. ఎప్పుడైనా ఎవరైనా ఆత్మలో ఆనందించి fast గా పాడినా, వాయించినా అది కూడా తప్పు కాదు. ఎందుకంటే విమర్శకులు – మేమూ కూడా మా అన్యదేవతలను ఇలాగే గట్టిగా ఆరాధిస్తాం, మీ యేసు దేవుడు కూడా అంతే అని అంటున్నారు.  అంటే వాళ్ల మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వేరే మతాల ఆరాధనలో కూడా కొన్ని పాటలు Melodious గా నిదానంగా ఉంటాయి. అందుచేత వాళ్లేదో అంటున్నారని మనం పట్టించుకోవద్దు. దానికి మనం బాధపడక్కరలేదు. మనం ఇష్టం, మన పద్దతి.  మనది మనం High speed లో పాడుతున్నామా, Low speed లో పాడుతున్నామో అనే దాని మీద యేసు దైవత్వం ఆధారపడి ఉండదు. యేసు నరవతారం ఎత్తాడు.  సిలువలో మన పాప పరిహారార్థం యజ్ఞముగా మరణించాడు, తిరిగి లేచాడు.  తిరిగి త్వరలో రానైయున్నాడు. ఇది మనం చెప్పాల్సిన Point.  అంతేగాని మనం Fast beat లో పాట పాడితే అవమాన కరంగా ఉంది అని బాధపడాల్సిన అవసరం లేదు. విమర్శుకులు మీరు ఏ speed లో పాడినా విమర్శిస్తూనే ఉంటారు. వాళ్ల మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.