(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: ఎవరైనా సేవలోనికి రావాలి అనుకుంటే మనకు అపోస్తులుడైన పౌలు తిరుగులేని మాదిరి. పౌలు ఒకప్పుడు క్రైస్తవ్యానికి విరోధంగా పనిచేసి తర్వాత దేవుడు దర్శించినప్పుడు రక్షణ పొందాడు. రక్షణ పొందిన వెంటనే ఆయన సువార్త ప్రకటించుట ప్రారంభించాడు. ఇది మనం చేయాల్సిన మొదటి పని రక్షణ పొందిన ప్రతీ ఒక్కరు తనకు అర్థమైనంత వరకు, తనకున్న అవకాశాలను ఉపయోగించుకొని యేసే రక్షకుడు వేరొక దారి లేదు అని ఎదురు పడ్డ వ్యక్తులకు చెప్పడం, కరపత్రాలు పంచడం అందినన్ని అవకాశాలు ఉపయోగించుకొని సువార్త చెప్పడం మొదలు పెట్టాలి. అలా పౌలు కూడా బర్నబా సహాయంతో చాలా నెలలు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు అంతియొకయా సంఘంతో మాట్లాడి వీరిని నేను ఎన్నుకున్నవారు అని బయలు పరిచాడు. అప్పుడు వారు ఉపవాసముండి ప్రార్థనచేసి వాళ్ల మీద చేతులుంచి హస్తనిక్షేపణ చేసి వారిని పంపించారు. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఎంటంటే అందిన చోట సువార్త ప్రకటించండి. కరపత్రాలు పంచడానికి సువార్త ప్రకటించడానికి Ordination అక్కరలేదు. గనుక మీరు దేవుని పని చేస్తూ ఉంటే మిమల్ని గమనిస్తున్న Senior సేవకులతో దేవుడే మాట్లాడుతాడు. పౌలు, బర్నబా వెళ్లి మాకు Ordination ఇవ్వండి అని అడగలేదు వాళ్ల పని వాళ్లు చేస్తూ ఉండగా దేవుడే దిగి వచ్చి వాళ్ల సంఘ పెద్దలతో మాట్లాడాడు. అప్పుడు వాళ్లు పిలిచి చేతులుంచి అబిషేకించారు. ఆ తర్వాత సంఘ స్థాపన ప్రారంభం అయింది. So, get busy with evangelisation, propagating the gospel. మీరు మీ పనిలో ఉండగా, దేవుడు మీకు తెలియకుండా వేరే వాళ్లతో మాట్లాడినప్పుడు మీకు హస్తనిక్షేపణ జరగడానికి అది right time అన్నమాట. మీరు అలా నిస్వార్థంగా సువార్త ప్రకటిస్తూ ఉంటే, దేవుడే మీకు సంఘ స్థాపన పరిచర్య కూడా అప్పగిస్తాడు. పౌలుకు అప్పగించినట్లు. ఇదే అందరూ గ్రహించాల్సిన సత్యము, క్రమము.