(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: అంటే నీకు రక్షణ పొందిన తొలిదినాలలో నా మీద ఉన్న ప్రేమ ఎవరికైనా రక్షణ పొందిన క్రొత్తలో దేవుని మీద విపరీతమైన ప్రేమ, భక్తి, అభిమానం, ఆయనతో సమయం గడపాలి అనే తీవ్ర వాంఛ ఉంటుంది. కొత్తగా ప్రేమలో పడిన ప్రేమికులు 24 గంటలూ మాట్లాడుతూనే ఉంటారు. 3-4 గంటలు కలిసి మాట్లాడాక ఇంటికెళ్లి మళ్లీ కాల్ చేసి మాట్లాడుతాడు. అదే విధంగా క్రొత్తగా రక్షణ పొందిన వానికి దేవునితో అటువంటి అనుబంధమే ఉంటుంది. ఆయనతో మాట్లాడాలి, ఆయన గ్రంథం చదవాలి. ఇదే ఆశ కానీ రానురాను రకరకాల దైనందిన కర్తవ్యాలు, బాధ్యతలు వాటన్నిటిలో నలిగిపోయి, Crush అయిపోయి కొన్ని సార్లు దేవుని కార్యక్రమాలు వీళ్లు అనుకున్నట్లు జరగక, వీళ్ల ప్రార్థనలకు అనుకున్నట్లు జవాబులు రాక కొంత నిరాశ, నిస్పృహ కలిగి మెల్లిగా దేవుని మీద విసుగు వస్తుంది. దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవుని సేవా కార్యక్రమాల పట్ల, ఒకప్పుడు ఉన్నంత ఆశ, చేయాలి చేయాలి అనే మంట తర్వాత ఉండదు. అయితే ఏ ఎత్తు నుండి నీవు పడ్డావో ఆ ఎత్తుకు నీవు మళ్లీ రావాలి అని ఎఫెస్సుకు రాసిన పత్రికలో అక్కడ చెప్పాడు. అంటే అది సాధ్యం. ఒకప్పుడు ఉన్నతమైన కొండ శిఖరం మీద ఉండి మన భక్తి మధ్యలో అగాధ కూపానికి పడిపోయాం. మళ్లీ లేవొచ్చు. మళ్లీ ఆ కొండ పైకి ఎక్కవచ్చు మన విశ్వాస జీవిత ప్రారంభంలో ఉన్నంత మంట మళ్లీ మనం పొందడానికి అవకాశం ఉన్నది అనేది అక్కడున్న సందేశం.