241. ప్రశ్న : జీవగ్రంథంలో పేరు ఎప్పుడు ఎక్కుతుంది?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:      భూమికి పునాది వేయకముందు దేవుడు కొంతమంది పేర్లు జీవగ్రంథంలో వ్రాసాడు.  ఎందుకంటే “నియమింపబడిన దినములలో ఒక్కటైనా జరగకముందే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను” అని దావీదు మహారాజు చెప్పాడు. ఇప్పుడు ఈయన దినములన్నీ దేవుని గ్రంథంలో రాసాడు అంటే ఈయన ఏదో పేరైతే ఉండాలి కదా.  అక్కడ దావీదు యొక్క దినచర్య, జీవితచరిత్ర అని రాయాలి కదా! Identification కొరకు మనుషులు పుట్టిన తర్వాత వీళ్ళకు ఏ పేరైతే పెట్టబోతున్నారో దాన్ని ముందుగా చూసి దేవుడు ఈ పేరును అక్కడ రాసి, ఆ పేరు పెట్టబడిన వాడు ఏ రోజు, ఏ రీతిగా బ్రతుకుతాడో మొత్తం అక్కడ record చేసేసాడు.  దేవుడి కార్యాలు మూడు దశలలో ఉంటాయి. జగదుత్పత్తికి ముందే దేవుని కార్యాలు అన్నీ సంపూర్తి చేయబడ్డాయని చెప్తాడు పౌలు భక్తుడు. అయితే సంపూర్తి అయినవి కూడా వాస్తవ జగతిలోకి రాకుండా అవి cancel అయ్యే అవకాశం ఉంది. హెబ్రీ 4:3 లో “కాగా జగత్తు పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నియు సంపూర్తి అయి ఉన్నను”. అన్నాడు.  అంటే యేసు అవతారం, సిలువ యజ్ఞం, పునరుత్థానం, ఈ సువార్త ప్రకటన దీన్ని కొంతమంది నమ్మి రక్షణపొందడం, కొంత మంది తృణీకరించి నిత్య నాశనానికి వెళ్లడం. తర్వాత రక్షణ పొందినవారిని మహిమ ప్రపంచంలో దేవుడు చేర్చడం.  ఈ కార్యాలన్నీ ఎప్పుడు Finish అయ్యాయి అంటే, జగత్తుపునాదికి ముందే finish అయిపోయాయి.  మరి అప్పుడు finish అయిన తర్వాత మళ్లీ ఒక కాలము సంపూర్ణం అయినప్పుడు యేసు పుట్టడం, కాలం సంపూర్ణం అయినప్పుడు సువార్త ద్వారా అనేకులు రక్షణ పొందడం, హతసాక్షులు కావడం జరుగును.  ఎవడు రక్షింపబడాలో, రక్షింపబడకూడదో ముందే రాసిపెట్టినప్పుడు ఈరోజు మనం సువార్త ప్రకటించి దెబ్బలు తినడం ఎందుకు? ప్రాణాలు ఇవ్వడం ఎందుకు? గనుక దేవుని కార్యాలు providiencial state అంటే దేవుడు దానిని మనోప్రపంచంలో నిర్ణయించడం వేరు. ఈ భౌతిక ప్రపంచం లోనికి అది క్రియారూపకంగా translate  కావడం వేరు.  ఈ మధ్య కాలంలో ఎవరి కొరకైతే దేవుడు సంకల్పించాడో వాడు దానిని చెడగొట్టుకోవచ్చు. ఎందుకంటే దేవుడు నియంత కాడు గనుక నీ పేరు నేను జీవగ్రంధంలో రాసాను గనుక నీవు నన్ను నమ్మాల్సిందే, రక్షణ పొందాల్సిందే, సేవ చేయాల్సిందే అని దేవుడు ఎవరినీ బలవంత పెట్టడు.  ఆయన నిర్ణయాధికారము మనకు ఇచ్చాడు.  అందుచేత దేవుడు ఏదైతే తన మనో ప్రపంచంలో finalise చేసాడో దానిని ఏ మనిషి కొరకు చేసాడో ఆ మనిషి కూడా అంగీకరించి Co-operative చేసినప్పుడే అది వాస్తవ జగత్తులోనికి translate అవుతుంది. గనుక దేవుడు ఎవరి పేర్లు జీవగ్రంథంలో రాసాడో వాళ్లు విశ్వసించారు.  కానీ అలాంటి వారిలో నుండి కొంతమంది పేర్లు వాళ్ల బుద్ధిహీనత కారణంగా చెరిపివేయుడం కూడా జరుగుతుంది. ఈ విషయంలో ఇస్కరియోతు యూదా ఒక ఉదాహరణ అపో 1:20లో “అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక. అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది” అందుచేత అతని ఉద్యోగం వేరొకడు తీసుకొనును గాక అంటే వానికి ఇవ్వబడింది ఆ ఉద్యోగం. అది కాపాడుకుంటే వాడిదే. కానీ వాడు ఆ ఉద్యోగం పొగొట్టుకున్నాడు.  ఇంకొకరు ఎవరో ఆ ఉద్యోగంలో వచ్చేసారు. ప్రకటన 14:9లో “ఎవడైన కౄరమృగమునకు గానీ ప్రతిమకు గాని నమస్కారము చేసి తన నొసటియందు, చేతియందు ఆ ముద్ర వేయించుకొనిన యెడల వాడు దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మధ్యమును వాడు త్రాగును. వాడి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును”. దేవుని యొక్క జీవగ్రంథంలో ఎవరి పేరైతే వ్రాయబడి ఉందో వాళ్లు ఆ ముద్ర వేయించుకోరు. ప్రకటన 13:8లో గొట్టెపిల్ల జీవగ్రంథంలో ఎవరి పేరు వ్రాయబడలేదో వారు మాత్రమే ఆ మృగానికి నమస్కారం చేస్తారు. అంటే ఎవరిపేరైతే జీవగ్రంథంలో ఉన్నయో వారు నమస్కారం చేయరు.  కానీ ఒకవేళ వాళ్లు నమస్కారం చేస్తే వాళ్ల పేరు చెరిపివేయ బడుతుంది. అందుచేత ప్రకటన 22:19 “ఎవడైన ఈ ప్రవచన గ్రంథమందు ఉన్న వాక్యములో ఏదైనా తీసివేసిన యెడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోనూ పరిశుద్ధ పట్టణములోనూ వానికి పాలు లేకుండా చేయును” అంటే అంతకముందు వాడు ఆ తప్పు చేయకపోతే వాడికి పాలు ఉండేది. ఆ తప్పు చేస్తే వానికి అందులోనుండి పాలు పోతుంది. దేవుని మనస్సులో ఒక కోటి మంది ఉన్నారనుకోండి. వారందరికి స్వయంనిర్ణయాధికారం ఉంది గనుక వాళ్లు సువార్త నమ్మకూడదని మొండిగా తీర్మానిస్తే, నమ్మినా కూడా బైబిల్ లోని మాటాలు కొట్టేయడం లాంటి దుర్మార్గపు పనులు వాళ్లు తెలిసి చేస్తే ఇస్కరియోతు యూదా లాగా వాళ్లకు దేవుడు పాలు లేకుండా చేస్తాను అన్నాడు. ఎందుకంటే నీకున్న స్వయం నిర్ణయాధికారాన్ని బట్టి నీవు ఎంచుకున్నావు.  అందుచేత నీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నా అని కొట్టేస్తాడు దేవుడు. గనుక దేవునికి సంబంధించినంత వరకు రాయబడడం వేరు మనం వాస్తవానుభవంలో వ్రాయబడింది అని మనం అనుకొవడం వేరు. దేవునికి తెలుసు ఎవరెవరు నమ్ముతారో.  కానీ మనకు తెలీదు కాబట్టే అందరికీ సువార్త చెప్తున్నాం.