(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: పాలస్తీన దేశపు, ఇశ్రాయేలు దేశపు ఆచారం ఏమిటంటే పెండ్లికి పిలువబడిన వారిలో వివిధ అంతస్థులు, హోదాలో ఉన్న వ్యక్తులు ఉంటారు. లోపలికి వచ్చాక ఒకరి బట్టలు పేదగా ఒకరివి చాలా ఖరీదైనవిగా ఉండొచ్చు.
లోపలికి వచ్చాక ఎవరూ గర్వించకుండా అందరూ గౌరవంగా సమానంగా ఒకరినొకరు చూసుకోవడానికి ఆ కాలంలో ఒక పద్దతి ఉండేది. దొంతలు దొంతలుగా పై వస్త్రాలు కొన్ని వేల పై-అంగీలు Entrance దగ్గర పెట్టేవారు. అక్కడొక పనివాడు ఉంటాడు. లోపలికి వస్తున్న ప్రతీ ఒక్కరు లోపలికి రాగానే వారి వీపు మీద ఈ వస్త్రాన్ని కప్పుతూ లోపలికి పంపిస్తాడు. So, లోపలికి ఎవరు వచ్చినా సరే వాడి మీద Automatic గా ఈ వస్త్రం పడిపోతుండి. లోపలికి వెళ్ళినాక అందరి వస్త్రాలు ఒక్కలాగా ఉంటాయి తప్ప ఒక్కరివి చవకదబారు వస్త్రాలు ఒకరివి ఖరీదైన వస్త్రాలుగా ఉండవు. ఆ ఏర్పరచబడిన సింహద్వారం ద్వారా వస్తే ఆ పెండ్లివస్త్రం మీద పడిపోతుంది. అయితే లోపల కూర్చున్న వాళ్లను యజమాని చూడడానికి వచ్చినప్పుడు ఒకడు పెళ్లి వస్త్రము లేకుండా ఉన్నాడు. అందుకే పెళ్లివస్త్రము లేకుండా లోపలికి ఎలా వచ్చావు అన్నాడు. సరియైన ద్వారం నుండి వేస్తే ఆ వస్త్రం నీ మీద పడేది. నీవు ఎలా వచ్చావు అంటే వాడు మౌనియై యుండెను గనుక కాళ్లు, చేతులు కట్టి వెలుపటి చీకటిలో త్రోసేసారు. అంటే అర్థం ఏమిటంటే రావాల్సిన దారిలో రాకుండా వీడు వేరే దొంగ దారిలో వచ్చాడని. గనుక వాన్ని అలా చేసారు. ఇది ఎవరికి సందేశం అంటే, యేసు ప్రభువే రక్షణ మార్గం, ఆయన సువార్త నమ్మి బాప్తీస్మం పొందటమే మార్గం. ఇంకా వేరే మార్గం లేదు అని మనం చెబుతున్నాం. కొంతమంది ఏమంటారంటే ఊరికి నాలుగు దారులు ఉన్నట్లు పరలోకానికి కూడా ఎన్నో దారులు ఉంటాయి. ఆ దారిలో మేము వెళ్తాము అని అంటారు. దాని జవాబుగా యేసు అనే దారిగుండా కాకుండా వేరే దారిగుండా నీవు వచ్చే అవకాశం లేదు. ఒకవేళ వచ్చినా సరే లోపలకి మళ్లీ చూసినప్పుడు నీవు అక్కడినుండి పడవేయ బడతావు. గనుక అలాంటి ఆలోచన విధానం Safe కాదు. దేవుడు ఏర్పరచిన ద్వారం గుండానే లోపలికి వెళ్లటానికి మీరు ప్రయత్నించండి అనే సందేశం ఆ ఉపమానంలో ఉంది.