245. ప్రశ్న : మన మీద దేవుని చిత్తం ఏమిటో ఎలా తెలుసుకోవాలి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:      మనం ఎవరమైనా దేవుని ప్రణాళిక గ్రహించాలి అంటే ముందు మనం అపో 2:42లోనికి వెళ్లిపోవాలి. “అతని వాక్యం అంగీకరించిన వారందరూ బాప్తిస్మం పొందిరి.  వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. ఈ నాలుగు అంశాలలో మనం స్థిరంగా నిలబడాలి. అపోస్తలుల బోధ అంటే, అపోస్తలులు ఏ సిద్ధాంతం చెప్పారో అందులో మనం ఈరోజు ఉండాలి. మధ్యలో పుట్టుకొచ్చిన బోధల్లో కాదు. Original అపోస్తులుల సిద్ధాంతంలో మనం కట్టబడాలి.  తర్వాత పరిశుద్ధుల సహవాసంలో ఉండాలి. ప్రతీ ఆదివారం ప్రభు రాత్రి భోజనాన్ని క్రమ పద్ధతిలో సరైన విధంలో ఆచరించాలి. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్ధన, సంఘ ప్రార్ధన ఈ మూడు రకాల ప్రార్ధనలో ఉండాలి. ఇందులో ఏది చేయకపోయినా దోషమే, అసంపూర్ణమే.  అందుచేత ఇవన్నీ చేస్తే చాలు. తర్వాత దేవుడు వారితో మాట్లాడుతూనే ఉంటాడు. హనోకు లాగా వాళ్లు దేవునితో నడుస్తూ ఉంటారు. ఆ తర్వాత దేవుని ప్రణాళిక, చిత్తం Automatic గా తెలియజేస్తాడు.  అసలు సహవాసానికి వెళ్లకుండా, బైబిల్ చదవకుండా, ప్రార్ధన చేయకుండా, ప్రభుబల్లలో పాలు పొందకుండా, మన బోధ అపోస్తలులకు వేరుగా ఉంటే మనం దేవుని ప్రణాళికలో ఉండాలి అనుకోవడమే ఒక గొంతమ్మ కోరిక. గనుక ముందు మనం ఈ basics చేయాలి. తర్వాత మనల్ని దేవుడే నడిపిస్తాడు. అప్పుడు మనం దేవుని వెంట పడడం కాదు. దేవుడే మన వెంట పడతాడు. నీ కృపా క్షేమములు నా వెంట వచ్చును అన్నాడు దావీదు. కృపా ఎక్కడా, క్షేమం ఎక్కడా? అని వెదకాల్సిన పని లేదు అవే వెంట వస్తాయి. “యెహోవా నా కాపరి” అయినప్పుడు. యెహోవా నా కాపరి ఎప్పుడు అవుతాడు? నేను ఆయన పరిపాలించే పౌరుడిని అయినప్పుడు. దేవుడు మనల్ని పరిపాలించే ఆ రాజ్య పౌరులుగా మనం ఉన్నప్పుడు ఈ నాలుగు మనం చేస్తాం. అప్పుడు దేవుడు మనతో సమృద్ధిగా, స్పష్టంగా మాట్లాడుతాడు.