(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: తెలుస్తాయి, తెలుసుకుంటాడు మనం గమనించవలసిన ఒక విషయం ఏమిటంటే సాతాను ఒక పడిపోయిన దేవదూత పడిపోయిన దేవదూత మాత్రమే కాదు దేవదూతలలో శ్రేష్టమైన Order కు చెందిన కెరూబు. The Highest Rodes of angelic being are cherubian. 2 పేతురు 2:11 “దేవదూతలు వారికంటె మరి అధికమైన బలమును, శక్తియు గలవారైనను, ప్రభువు ఎదుట వారిని దూషించి వారిమీద నేరము మోప వెరుతురు. అని వ్రాయబడింది. అంటే చాలా మంది మహాత్ములను దూషిస్తూ ఉంటారు. ఎవరూ waste కాదు. అందరివల్లా దేవుని కార్యం ఎంతోకొంత జరిగింది. “ఏ వ్యక్తినిగానీ, ఏ మతమును గానీ, ఏ డినామినేషనన్ను గానీ దూషించరాదు, ద్వేషించరాదు” అని ముంగమూరి దేవదాసు అయ్యగారు చెప్పారు. అయితే కొంతమందీ మహత్ములను అవలీలగా తీసిపారవేసినట్టు మాట్లాడుతారు. వాళ్ల గురించి మాట్లాడుతూ, దేవదూతలు వీరికంటే అధికమైన బలమును, శక్తియు గలవారైనను” అన్నడు దేవదూతల Order లో Highest Order అయినటువంటి కెరూబులలోనే Highest order కు చెందినవాడే ఇప్పుడు సైతానుగా మారాడు. యెహెజ్కేలు 28:14లో “అభిషేకము నొందిన కెరూబువై యొక్క ఆశ్రయముగా నీవుంటివి; అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతముమీద నీవుంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి”. ఇతడు కెరూబు, దేవుడు మాత్రమే వెళ్లగలిగిన ఒక పర్వతం ఉండేది దాని మీదికి వీడు వెళ్లి వచ్చేవాడు. 12వ వచనంలో “పూర్ణజ్ఞానమును, సంపూర్ణ సౌందర్యమునుగల కట్టడమునకు నీవు మాదిరివి”. వీనికి జ్ఞానములోనూ Perfect Wisdom చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాడు. అతడు పడిపోయాడు. గనుక మానవాతీతమైన జ్ఞానము, బలము, పరాక్రమము కలిగిన వాడు. పడిపోయిన మనకు ఈ లోకంలో Face Reading, Mind Reading, Hypotism ఉన్నాయి Hypno- tism నేర్చుకున్న వ్యక్తులు అవతలివాళ్ల కళ్లలో కళ్లు పెట్టి చూసి ఆ చూపులు కలవగానే Mind మీద grip తీసుకుంటారు. తీసుకొని వాళ్లకు కొన్ని commands ఇచ్చి వాళ్ల Mind లో అది Implant చేస్తారు. తర్వాత వాళ్లను పంపించేసి వాళ్ల ద్వారా ఎటువంటి కార్యం అయినా చేయించుకోగలరు ఒక మానవుడే ఇంకొక మానవుడి Mind మీద అంత Grip సంపాదించ గలిగినప్పుడు కెరూబులలో కెల్లా శ్రేష్ఠుడైన ఒక కెరూబు వాడు ఎందుకు చేయలేడు కచ్చితంగా చేయగలుగుతాడు. అయితే వాడు చాలా శక్తి, బలము, సామర్థ్యము కలిగిన వాడు కాని అనంత శక్తి సంపన్నుడైన
క్రీస్తు నాధుడు మనలో ఉన్నాడు గనుక. వాడు మనల్ని ఏమీ చేయలేక పోతున్నాడు. మనకు యేసయ్య ఉన్నాడు. గనుక వాడి ఆటలు సాగడం లేదు.