(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: యూదా కోడలైన తామారు తన మామగారితోనే గర్భవతి అయ్యింది యూదాకు మొదటి కొడుకు ఏరు, ఏరు భార్య తామారు. ఏరు దుర్మార్గంగ ప్రవర్తిస్తూ, పాపాలు చేస్తుండెవాడు. గనుక దేవుడు వాడిని చంపేసాడు అప్పటి కాలపు సామాజిక ఆచారాన్ని బట్టి ఈమె సంతానం లేకుండా ఉన్నారు గనుక మరిదిని ఇచ్చి పెళ్లి చేసాడు పుట్టే మొదటి కొడుకు మీ అన్నయ్యకు పేరుమోస్తాడు అని. అందుచేత ఏరుకు తమ్ముడైన ఓనాను ఇచ్చి పెళ్లి చేసాడు. ఓనాను ఆమెను భార్యగా చేసుకొని సుఖం అనుభవించాడు గానీ Sperm బయట విడవడం జరిగింది. భార్యగా సుఖపెట్టాలి గానీ సంతానం వద్దు అనుకున్నాడు. ఇది దుష్ట హృదయం గనుక దేవుడు వాన్ని కూడా చంపేసాడు. ఈమెతో పెళ్లెతే చనిపోతున్నారు అని మూడవ కొడుకు పెద్దవాడు అయ్యేదాక మీ తల్లిగారి ఇంటికి వెళ్లిపోమని ఆమెను పంపించేసాడు. కొంతకాలం అయ్యాక షేలా పెద్దవాడు అయ్యాడు గానీ యూదా ఈమెను తలుచుకోలేదు.
38:14లో “షేలా పెద్దవాడైనప్పటికినీ తాను అతనికి ఇవ్వబడకుండుట చూచి” తామారు ఒక Plan వేసింది. ఆమె యూదా వెళుతున్న దారిలో దారికాచింది. తర్వాత యూదా ఈమెను వేశ్య అనుకున్నాడు. అలా అసుకొని ఆమెను అనుభవించాడు తర్వాత ఆమె గర్భవతి అయ్యింది. 24లో “అప్పుడు యూదా ఆమెను బయటికి తీసుకురండి ఆమెను కాల్చివేయవలెను”. నా కోడలు తండ్రి ఇంటికి వెళ్లి వ్యభిచారం చేసి గర్భవతి అయ్యింది అని అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. వేశ్య అనుకొని ఒక అమ్మాయిని తెచ్చుకున్నాడు షేలాను పెద్దవాడయ్యాక నీకు ఇస్తానని చెప్పి మాట తప్పాడు అప్పుడు నీతిమంతుడట. తన కోడలికి చేయవల్సిన న్యాయం చేయలేదు ఇన్ని చేసిన వాడు ఈ తామారును కొట్టి చంపివేయాలి అని నీతులు మాట్లాడుతున్నాడు. అప్పుడు తామారు. ముందే Prepare అయి ఉన్నది. తన మీద ఆ ఆరోపన వచ్చినప్పుడు ఇదిగో ఈ ముద్ర, ఈ దారం, ఈ కర్ర ఎవరివో ఆ మనుషుని వల్లనే నేను గర్భవతినైతిని అని అందరి ముందు అవి పెట్టింది. అప్పుడు యూదా అన్నాడు 26లో నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇవ్వలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలు. ఆమెకు నేను షేలాను ఇచ్చి పెళ్లి చేస్తే ఇదంతా జరగదు. గనుక ఆమె ఆ తప్పు చేయడానికి నా తప్పే కారణం అని ఒప్పుకున్నాడు. వారికి పుట్టిన ఆ పిల్లల ద్వారానే ఆ యూదా వంశము కొనసాగింది.