(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: ప్రతి ఒక్కరిని కాపాడమని మనం ప్రార్థిస్తూ ఉంటాం కదా! ఆ ప్రార్థనను మానేస్తే సైతానుకు వాడు దొరికిపోతాడు. ఎందుకంటే “వారు దూషింపకుండా శిక్షింపబడునట్లు” అన్నాడు. వారు చాలా ద్రోహం చేసారు. అంత ద్రోహం
చేసిన వాళ్లు శిక్షింపబడాలి. కానీ శిక్షింపబడేటప్పుడు వారు దూషించకూడదు. మీరు చేయబట్టి మేము శిక్ష అనుభవిస్తున్నాం, నష్టపోయాం అని వాళ్లు దూషింపకుండానే శిక్షింపబడాలి. అందుచేత వీళ్లను కాపాడు ప్రభువా..! అని చేసే ప్రార్థన మానేసి వారికి వచ్చే ఏ కీడునైనా రానివ్వు ప్రభువా! నీ ఇష్టం. కాపాడమనే ప్రార్థన నేను చేయను” అని దేవునికి చెప్పేస్తే, వారి గురించి ప్రార్థన చేయడం మానేస్తే, కొన్ని వేల దురాత్మలు వారి మీద దాడి చేయడానికి ready గా ఉంటాయి. వారు సువార్తకు, యేసు ప్రభు నామానికి ద్రోహం చేసారు గనుక వారు మనలో ఒకరు కాదని వదిలేసిన తర్వాత అనేక రకాలుగా ఆ చీకటి శక్తులు వారి మీద దాడి చేస్తాయి. ప్రాణాలు కూడా తీసివేయవచ్చు. అలాంటప్పుడు పౌలు నన్ను కొట్టాడు, యేసు నన్ను కొట్టాడు అని దూషించడానికి అవకాశం లేదు. ప్రతీ మానవున్నీ ఎప్పుడు Attack చేద్దామా? అని కొన్ని శక్తులు ఎదురుచూస్తూ ఉంటాయి. దేవుని కృపలో కాపాడబడుతున్నాం గనుక ఆ శక్తులు ఏమీ చేయలేక పోతున్నాయి. దేవుడు కాపాడాలి అనే ప్రార్థన కవచాన్ని తొలగించడం జరిగినప్పుడు దేవుడు సన్ను ఇలా చేసాడు అనడానికి అవకాశం ఉండదు. వాడు దేవుడినే దూషించాడు, ద్వేషించాడు గనుక నా గతికి నేనే కారకుడిని అనుకుంటాడు తప్ప వాడు శిక్షింపబడేటప్పుడు వేరే వాళ్లను దూషించడానికి అవకాశం లేదు అదే పౌలు చెప్తున్న విషయం.