(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: కర్ణపిశాచి పిలిస్తే భక్తులు ఆత్మలు గానీ, ప్రవక్తల ఆత్మలుగానీ, భక్తిహీనుల ఆత్మలు కూడా రావు. కర్ణపిశాచి అంటే పడిపోయిన దేవదూతల ఆత్మ వీళ్ల మీదికి రావడం. English బైబిల్లో Familiar Spirit అని ఉంటుంది. అంటే పరిచయం ఉన్న ఒక దూతాత్మ అని అర్థం. దురాత్మళ్ళో ఒకరితో ఈ కర్ణపిశాచి చేసే వాళ్లు Friendship చేస్తారు అన్నమాట. కర్ణపిశాచి పిలిస్తే భక్తుల లేదా భక్తిహీనుల ఆత్మలు వస్తే, లేదా వచ్చే అవకాశం ఉంటే నరకంలో ఉండరిక. అందరినీ బయటికి పిలిచేస్తాడు సాతాను. గనుక పరదైసు నుండి గానీ, సరకం నుండి గానీ ఎవరినీ పిలిచే అవకాశం ఎప్పటికీ లేదు. కర్ణపిశాచి అనేది ఒక డ్రామా. ఎవరిని పిలవమన్నా మంత్రం వేస్తాడు వాడి friend దురాత్మ వస్తాడు. ఆ దురాత్మలు ప్రపంచమంతా తిరుగుతారు. మనకు తెలియని విషయాలు ఎన్నో వాళ్లకు తెలుస్తాయి. గనుక best of their knowledge ప్రకారం మనం అడిగిన దానికి సమాధానం చెప్తారు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా విషయం అడిగారనుకోండి, అది ఆ దెయ్యానికి తెలుసు గనుక ఆ విషయానికి జవాబు సరిగ్గా చెప్తుంది. నిజంగానే చనిపోయిన వాళ్ల ఆత్మ వచ్చింది అనుకుంటాం మనం. కానీ అది పడిపోయిన దేవదూత. ఆ రకంగా మోసం చేయడమే కర్ణపిశాచి ప్రక్రియ. గనుక కర్ణపిశాచి పిలిస్తే ప్రవక్త గానీ, భక్తిహీనుడు గాని ఎవరూ రారు. ఆ దయ్యం మాత్రమే వస్తాడు. కానీ ఎప్పుడూ జరగని అద్భుతం అక్కడ జరిగింది. ఏమిటంటే నిజంగా సమూయేలు వచ్చేసాడు. అందుకని ఆమె గడగడ వనికిపోయి, పెద్దగా కేక పెట్టి మృతుల లోకమునుండి భక్తుడు, ప్రవక్త వచ్చాడంటే దేవుడు జొక్యం చేసుకుంటే తప్ప ఇలా రావడానికి వీల్లేదు. యెహోవా దేవుడే దిగివచ్చి నేను పిలిచిన నా friend దురాత్మను త్రొక్కివేసి అసలు ప్రవక్తను పంపించాడంటే నా ముందు కూర్చున్న వీడు సామాన్యుడై యుండడు. ఇదిగో నువ్వు సౌలువా? అని అడిగింది. అప్పటిదాకా సౌలు మారువేషంలో ఉన్నాడు. అప్పుడు నేను సౌలునే అన్నాడు ఆ తర్వాత విషయం మనకు తెలుసు.