264. ప్రశ్న : సార్ నేను ఒక విశ్వాసిని వంటలు చేస్తాను. హిందు సహోదరులు వారి ఫంక్షన్స్ ఉన్నప్పుడు నన్ను పిలుస్తారు. దశదినకర్మ, సంవత్సరికం అని వివిధ సంధర్భాలలో భోజనాలు సిద్ధపరచడానికి నన్ను పిలుస్తారు. నేను చేయవచ్చా దయచేసి తెలియజేయగలరు.

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:      తప్పకుండా చేయవచ్చు. మీ డ్యూటి మీది. మామూలు నీళ్లు శంఖంలో పోస్తేనే శంఖుతీర్థం అవుతుంది. అని సామెత దాన్ని మనం ఏ దృష్టితో చూస్తున్నామనేదాన్ని బట్టె ఆధారపడి ఉంటుంది. మామూలు లడ్డునే దేవుని ముందు పెట్టి తింటున్నామని దేవుని ప్రసాదం అని తింటున్నాము అని వాళ్ల అనుభూతి అది. వాళ్ల అనుభవం వాళ్ళ ఇష్టం. అయితే లడ్డులు చేయొద్దు ఎవరైనా నైవేద్యం పెడతారు గనుక అని మనం చెప్పలేము గదా! Sweet Shop పెట్టుకోవచ్చు, Sweet Shop పెట్టుకుంటే ఎవరైనా లడ్డులు కొనుక్కొని పోయి దేవునికి నైవేద్యం పెట్టి దేవుడి ప్రసాదంగా తింటారెమో గదా! అంటే పెట్టుకోని, మనకు ఆదోషంగాని, ఆ పుణ్యం గానీ మనకు అంటదు. ఆ మతంలో, ఆ ధర్మంలో, ఆ విశ్వాసంలో ఉన్నవారు ఏ విశ్వాసంతో ఉపయోగిస్తున్నారో ఆ పాప పుణ్యాలు, గుణ దోషాలు వారికి వర్తిస్తాయి. ఒకరికి ఒక కొబ్బరి తోట ఉంది, కొబ్బరికాయల వ్యాపారం చేస్తున్నాడు. వేరేవాళ్లు ఆ కొబ్బరికాయలు కొనుక్కొని పోయి, గుళ్లో దేవుని ముందు కొట్టి వాళ్లపూజలు వాళ్లు చేయొచ్చు. కొబ్బరి పంట పండించినందుకు అతడు విగ్రహరాధనకు, సహకరించాడని దేవుడేమి కోపపడడు. ఈ లోకపు విగ్రహరాధకులతో నైనను, జారులతోనైనను, లోభులతోనైనను, ఏ మాత్రము సాంగత్యము చేయవద్దని కాదు ఆలాగైతే మీరు లోకములో నుండి వెళ్లిపోవలసి వచ్చును గదా అంటాడు పౌలు కాస్తో కూస్తో విగ్రహరాధకులతో సంబంధం ఉంటుంది, ప్రతి మతంలో ఉన్నవారితో మనకు సంబంధం ఉంటుంది. ఎందుకంటే మనం లోకంలో జీవిస్తున్నాము కాబట్టి 1కొరింథీ 5:9-11

                లోకస్తులు వాళ్ల విశ్వాసంలో వాళ్లు జీవిస్తుంటారు. వాళ్ల విశ్వాసంలో వాళ్లు నడుస్తుంటారు. వాళ్లతో స్నేహం చేయను, నమస్కారం పెట్టను, వారిని పలకరించను, వాళ్లు చచ్చినా సరే వెళ్లను, పట్టించుకోను, అంటే భక్తి కాదు, మూర్ఖత్వం అవుతుంది.

                నేను 1000 సంఘాలు కట్టిన వాణ్ణి, నాకు నాస్తికులు, హిందువులు బోలేడు మంది స్నేహితులున్నారు. నేనంటే ప్రాణం పెట్టే వాళ్లున్నారు ముస్లింలు నన్ను సొంత అన్నయ్యగా, తమ్మునిగా చూసుకునే వాళ్లున్నారు. అది నాకేమి అభ్యంతరం కాదు, నా విశ్వాసం వాళ్లకు కూడా అభ్యంతరం కాదు. నేను వాళ్లను ఎప్పుడైనా దర్శించినప్పుడు వాళ్లు ఇంట్లో పూజ చేస్తుఉంటే, నేను Wait చేస్తాను అంతలోనే నేను అపవిత్రున్ని కాను. దేవుడు భౌతిక స్థలాలపైన భౌతిక పదార్థాల పైన అంతగా దృష్టిపెట్టడు.