(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: ఒకసారి గండిగుంట రాజబాబు గారి Meetings లో Stuvartupuram Sudhakar garu సాక్ష్యం చెప్పారు. నేను భారతదేశంలో అంతరాష్ట్ర గజదొంగగా అన్ని జైళ్లకు వెళ్లాను. అన్ని రకాల దొంగతనాలు చేశాను. అని సాక్ష్యం చెప్పారు తరువాత నేను రక్షణ పొందాను అని చెప్పాడు.
తరువాత రంజిత్ ఓఫీర్ గారు సాక్ష్యం చెప్పండి అన్నారు. అప్పుడు నేను 6 సం॥రాల ప్రాయంలో మా అమ్మ నన్ను రక్షణలోకి నడిపించింది, 10 సం॥రాల వయస్సులో నేను పరిశుద్ధాత్మను పొందాను. 15 సం॥రాలకు బాప్తిస్మం తీసుకున్నాను. తరువాత నన్ను దేవుడు తన సేవకు పిలిచాడు అని చెప్పాను. అప్పుడు ఇదేం సాక్ష్యమండి రంజిత్ ఓఫీర్ గారికి గొప్ప సాక్ష్యమేమీ లేదు. ఒక్కసారి కూడా జైలుకు వెళ్లలేదు. అదేం సాక్ష్యమండి అన్నారు. అది వాళ్ల అమాయకత్వం, దావీదు భక్తుడు “బాల్యమునుండి నీవు, నాకు బోధించుచునే వచ్చితివి” అన్నాడు కీర్తనలలో ఆయన బాల్యం లోనే కీర్తనలు పాడి, సితారా వాయించి, దేవున్ని ఆరాధించిన భక్తుడు.
తిమోతి కూడా బాల్యం నుండి విశ్వాసములో నివసించెను. ఆ విశ్వాసము నీ తల్లి యైన యూనికెలోను, నీ అవ్వయైన లోయలోను వసియిస్తూ ఉన్నది అన్నాడు. నీవు బాల్యము నుండి రక్షణార్థమైన జ్ఞానము కలిగించుటకు శక్తి కలిగించు, పరిశుద్ధ లేఖనాలను ఎరుగుదువు. అట్లయితే దావీదు, తిమోతి లది కూడా గొప్పసాక్ష్యం కాదన్నమాట వీరి లెక్కప్రకారం. ఈ సాక్ష్యాలు దేవుని ముందు వృధా అని కాదు గానీ, నేర చరిత్ర కలిగిన భక్తుల సాక్ష్యాలు క్రీస్తు విరోధులను, క్రీస్తు సువార్త అంటే ఇష్టం లేని వాళ్లను కూడా ఆలోచింపజేస్తాయి. అదీ విషయం. ఇప్పుడు నా సాక్ష్యం వింటే అదేముందండి మీ తల్లిదండ్రులు క్రైస్తవులు, నీకు భక్తి నేర్పించారు. నీవు దేవున్ని వెదికి తెలుసుకున్నదేముంది, నీ తల్లిదండ్రులే యేసు ప్రభువును పరిచయం చేశారు. అందులో గొప్పేముందండి అంటారు. నన్ను గానీ, తిమోతినిగానీ ఇలా అంటారు. కానీ పౌలు నేను ఒకప్పుడు పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను, సంఘమును పాడుచేసిన వాడను, ఇప్పుడు ప్రభువు దాసుడను. అంటే సువార్తను ద్వేషించే వారు, సువార్త అంటే ఇష్టం లేనివాళ్లు కూడా ఒక్కసారి ఆలోచిస్తారు. నాకు సువార్త ఇష్టం లేదు నాకంటే ఇతడు సువార్తను ఎక్కువ ద్వేషించినవాడు ఇప్పుడు సువార్త కొరకు ఎలా దెబ్బలు తిన్నాడు. తింటున్నాడు అని కొంచెం ఆలోచనలో పడతారు. కాబట్టి క్రీస్తును ఎరుగని వారు, క్రీస్తు సువార్త అంటే ద్వేషం కలిగిన వాళ్లను ఆలోచింపజేయడానికి Stuvartupuram Sudhakar గారి సాక్ష్యం అపొస్తలుడైన పౌలు సాక్ష్యాలు పనికొస్తాయి.
ఒక Section of people కు ఆ సాక్ష్యాలు పెద్దగా ప్రయోజనం కాదు. గాని మన ప్రార్థన, మన సువార్త ప్రకటన, మన యొక్క దేవుని వాక్య సేవ ఫలితాలస్తాయి. నేను ఒక్కసారి కూడా జైలుకు వెళ్లలేదు. నా జీవితంలో బల్ష్బలు, దెలీలాలు లేరు, తప్పు చేసింది లేదు. ఏమి లేదు. సాతాను గాడు నన్ను ముట్టుకోక ముందే దేవుడు నన్ను పట్టుకున్నాడు. అయినా 1000 సంఘాలు కట్టాను మరి. గనుక దేవుడు వాడుకోవడానికి అదేం అవసరం లేదు గానీ, సమాజంలో కొంతమంది ఉంటారు, సువార్త అంటే ద్వేషించేవారు, వాళ్లను ఆకర్షించడానికి, ఆలోచనలో పడేయడానికి పౌలు భక్తుని సాక్ష్యం, స్టూవర్టుపురం సుధాకర్ గారి సాక్ష్యం లాంటి సాక్ష్యాలు ఉపయోగపడతాయి. అంతే. మీరు, నేను, బైబిలు లో తిమోతికి భీకరమైన సాక్ష్యం ఏమీ ఉండదు. దేవుడు మనలో రక్షణార్థమైన విశ్వాసం కలిగించాడు. ఆ లెక్కన చూస్తే పెంతెకొస్తు నాడు 3000 మంది బాప్తిస్మాలు పొందారు వారికి కొర్నేలి ఇంటివారికి, ఇథియోపీయుడైన నపుంసకుడు (ఇథియోపీయుల రాణియైన కందాకే క్రింద మంత్రి) కి ఏం సాక్ష్యం ఉంది. కాబట్టి చాలా భీబత్సమైన నేరచరిత్ర ఉంటేనే గొప్పసాక్ష్యం అని ఏమీ లేదు. ఒక Section of people కు Appealingగా ఉంటుంది అంతే ఆ సాక్ష్యం ఉన్నవారికంటే మన సేవను పరిశుద్ధాత్మ వాడుకుంటాడు ఆ విషయంలో అనుమానం అక్కర్లేదు.