(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: పిల్లల పెంపకం అనేది అత్యంత క్లిష్టమైన ఒక ప్రక్రియ అది అంత ఈజీ కాదు. కోళ్లను, మేకలను పెంచొచ్చు వాటికి సమయానికి దాన వేస్తే సరిపోతుంది. కానీ మన ఇంట్లో ఉన్న పిల్లలు వాళ్లు దేవుని పోలికలో సృష్టింపబడిన చిన్న, చిన్న మానవ మూర్తులు వాళ్లు. గనుక వాళ్లను సాతాను తనవైపు మళ్లించుకోవాలని విశ్వప్రయత్నం చేస్తాడు. మనమేమో వాళ్లను దేవునిలో పెంచాలని ప్రయత్నం చేస్తుంటాము మీరేమైనా చిట్కా / రహస్యం కనుక్కున్నారా? అని అడిగాడు ఆ బ్రదర్. నేను కనుక్కొన్నది ఒక్కటే దేవుడు బైబిల్లో అన్ని ప్రశ్నలకు జవాబులు వ్రాసి పెట్టాడు. ఈ ప్రశ్నకు కూడా జవాబు వ్రాసి పెట్టాడు. సామెతలు 22:6 దానికి తిరుగులేని సమాధానం “బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అన్నాడు సొలోమోను భక్తుడు. వాణ్ణి సాతాను Tempt చేయాలంటే (కొంచెం) జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు కొంచెం పరిపక్వమవుతున్న దశ (Adolescense) లో అంటే Entering into teenage లో ఎక్కువగా Vulnerable గా శోధనలకు ఎక్కువ Exposed గా చాలా బలహీనమైన స్థితిలో ఉంటారు. దానికి తోడు అమాయకత్వం వారి కుతూహలం, ఏదో చూడాలి, ఏదో చేయాలి, నాకు తెలియంది ఏదో ఉంది ఈ లోకంలో, అందరు నాకు దాచేస్తున్నారు, అది తెలుసుకోవాలి ఇప్పుడు అని కుతూహలంగా, Inner tension ని Build up చేసుకుంటారు. అలాంటి సమయంలో వాళ్లు చూడకూడని దృశ్యం ఏదైనా కనిపిస్తే అన్ని ప్రక్కనబెట్టి దాని మీదనే మనసు పెడతారు. గనుక పిల్లలు చెడిపోవడం చాలా చాలా Easy, బాగుపడడం చాలా కష్టం. అందుచేత మనం ఏం చేయాలి అంటే ఈ Adolessense వచ్చి, సాతాను శోధించగలిగే మేరకు వాళ్ల అవయవాలు Develop అవుతావుంటే, ఆ దశకంటే ముందే దేవుణ్ణి నమ్మగలిగిన విశ్వాసం గల హృదయం ఉంటుంది. గనుక బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పించాలి. వాళ్లకు 5,6 సం॥రాలు వయస్సులోనే వారికి రక్షణ సువార్త చెప్పి ఉదయం, సాయంత్రం ఏకాంత ప్రార్థన చేసుకోమని, దేవునితో మాట్లాడు, దేవుడు నీ ప్రార్ధన వింటాడు అని మనం నేర్పించగలిగితే సాతాను వారిని ముట్టుకోక ముందే పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయంలోకి ప్రవేశిస్తాడు. వారు దేవునికి Link up అయిపోతారు. Dr. Billy Graham గారి సతీమణి గారు దాదాపు 5 సం॥రాలకే రక్షణ పొందారు. F.B. Mayer అనే భక్తుడు 5 సం॥రాలకే రక్షణ పొందాడు, నేను 6సం॥రాలకే రక్షణ పొందాను. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయంలో ఉన్నప్పుడు, ఆ పిల్లవాడు కొంచెం పెద్దవాడు అవుతున్నప్పుడు సైతాను దగ్గరికొస్తే ఆ వ్యవహరం దేవుడే చూసుకుంటాడు. ఇది ఒక విషయం. ఇక రెండో విషయం ఏంటంటే క్రైస్తవ కుటుంబాలలో తప్పకుండా, విధిగా కుటుంబప్రార్థన అవసరం. చిన్న పిల్లలను Sunday School కు పంపించడం చాలా అవసరం. Basically I started my ministry as a child evangelist. నేను నకరికల్లో సేవ చేసేటప్పుడు నా సంఘ సభ్యులు రొట్టె విరిచేవాళ్లేమో 20మంది, పాతిక మంది. కానీ Sunday School పిల్లలేమో 400 మంది. నేను పెద్దవాళ్లకు వాక్యం చెప్పింది ఎంతో దాదాపు చిన్నపిల్లలకు వాక్యము చెప్పింది అంతే. నాకు తెలిసి బాల్యంలో రక్షణ పొందినవాడు పెద్దవాడయినాక భ్రష్టుడు కావడం అనేది దాదాపు లేదనే చెప్పాలి. బాల్యంలో రక్షణ పొంది, యౌవ్వనంలో పడిపోయిన వాడు కూడా మళ్ళీ చనిపోకముందే దేవునిలోకి వస్తాడు తప్పకుండా దానికి Best Example Solomon మహరాజు. పెద్దవాడయ్యాక కామాతురుడయ్యాడు, అన్ని చెడ్డ పనులు చేసాడు, కానీ ముసలి వాడయ్యాక మారుమనస్సు పొంది ప్రసంగి గ్రంథం వ్రాసాడు.
చిన్న పిల్లలకు ఎప్పుడు ఏ వస్తువు కొనివ్వాలో తల్లిదండ్రులు విచక్షణ కలిగి ఉండాలి. చిన్నపిల్లలకు Mobile ఇవ్వకూడదు. కానీ చిన్న పిల్లలు, 7వ, 8వ క్లాసు రాగానే తల్లిదండ్రులే వాడికి Mobile Phone కావాలి అని కృత్రిమ అవసరాన్ని Create చేసి ఇస్తున్నారు. Mobile లేకపోతే ఏలాగ అని ప్రాణవాయువు Oxygen లేకపోతే ఏలాగా అన్నట్లు గాబరా పడిపోతున్నారు. మహత్మాగాంధీ, నెహ్రూ, ఇందిరా గాంధీ వాళ్లు జీవించిన సమయంలో Mobile లేదు, నేను చదువుకున్నప్పుడు, College పయస్సులో, నిన్న మొన్నటి వరకు కూడా మాకు మొబైల్స్ లేపు లోకం నడవలేదా? మా చదువులు, మా Course లు జరుగలేదా! అది ఒక Addiction, Evil addiction అయిపోయింది. Mobileఅనేది ఒక Technological Development Object దానికి Positive side కూడా ఉంది. పరిపక్వత వచ్చిన తరువాత Mobile ఉండి, Internet Access ఉంటే దాంట్లో ఆధ్యాత్మిక, Personality development విషయ పరిజ్ఞాన సేకరణకు ఎంతో తోడ్పడుతుంది. పరిపక్వత రాకముందే మంచి, చెడులు కలిసి ఉన్న Mobile ను ఇవ్వడం వల్ల సహజంగానే చెడుకు ఆకర్షితుడవుతాడు. ఒక భక్తుడు చెప్పాడు “You know how to switch on the T.V. But you should know when switch it off’. ఎలా ఆన్ చేయాలో తెలిసింది కానీ ఎప్పుడు ఆఫ్ చేయాలో తెలియలేదు తల్లిదండ్రులు తెలుసుకోవాలి, ఏంటంటే పిల్లలు అడిగిందల్లా ఇవ్వడం ప్రేమకాదు. “బెత్తము వాడని తండ్రి తన కుమారునికి విరోధి “అంటాడు సొలోమోను మహరాజు. నేను అడిగింది మా అమ్మకు, మా నాన్నకు నచ్చితేనే ఇస్తారు. మా అమ్మదే Final Desicion, మా నాన్నదే Final Desicion అనే భావన పిల్లలకు రావాలి. చిన్నప్పుడు భయం పెట్టడం ఈజీ, చిన్నప్పుడు భయం పెడితే అసలు బెత్తం కూడా అవసరం లేదు. మీ ప్రేమ తెలివితో కూడినదై యుండాలి. అంటుంది Bible లో. Internet access వాళ్లకు ఎప్పుడు అందుబాటులోకి తేవాలో తల్లిదండ్రులు తెలుసుకుని ఉండాలి. వాళ్లు ఏం చేస్తున్నారో చూస్తూ ఉండాలి. పిల్లలు ఎవరితో సాంగత్యం చేస్తున్నారో కనిపెట్టాలి. Bad friend ship cut off చేయాలి. ఇది చాలా కష్టమైన విషయం ఒక్కొసారి పిల్లలు అడిగింది ఇవ్వనప్పుడు వాడు ఏడుస్తుంటే తల్లిదండ్రులు హృదయం గాయపడుతుంది. అయినా వాన్ని గాయపరచి, నాకు నేను గాయం చేసుకొని అయినా సరే మంచి మార్గంలో నడిపించాలి. అప్పుడు నేను మంచి తండ్రినవుతాను అనే Concept ఉండాలి. ఇలా చేస్తే పిల్లలు భ్రష్టులయ్యే అవకాశమే లేదు. ఈ విధంగా పెంచాలని, నా మనవి, నా విజ్ఞప్తి.