(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: మనం ఇంతకు ముందు ఒక ప్రశ్నకు ఇచ్చిన జవాబు ఉంది చూసారూ. కొబ్బరితోట, వంటలు వండడం అనే వాటి దగ్గర ఉన్నటువంటి Liberal Attitude పరవాలేదులే కొబ్బరికాయ పంట, అది ఒక వ్యవసాయం వృత్తిపని, నా బ్రతుకు దెరువు, నేను వాటిని అమ్ముతాను, కొన్నవాళ్లు తరువాత దానిని దేనికైనా వాడుకుంటారు. అన్నం వండేస్తాను అది దాన్ని వాళ్లు ప్రసాదం పెట్టుకోని, ఏమైనా చేసుకోని అనే Liberal attitude ఈ మ్యూజిక్ దగ్గర ఉండడానికి వీలులేదు. ఎందుకంటే నేను పంట పండించడానికి, అమ్మడానికి, కొనుక్కున్నవాడు దాన్ని తీసుకెళ్లి గుడిలో పూజల్లో ఉపయోగించడానికి మధ్యలో Time Laps ఉంది. నేనిక్కడో విగ్రహానికి, విగ్రహరాధనకు దూరంగా ఉన్నాను. అంతే కాకుండా నేను అమ్మే ఆ కొబ్బరికాయను విగ్రహనికి వాడుమని చెప్పి ఇవ్వలేదు, కొనేవాడు కూడా విగ్రహపూజకు అని చెప్పి కొనుక్కోలేదు. దాన్ని మార్కెట్లో వస్తువుగా వాళ్లు కొన్నారు. వాళ్ల దేవుని ముందు ప్రసాదం కాదు, మార్కెట్లో ప్రయోగించినప్పుడు కూడా అది పవిత్రమైనదిగా ఎంచబడదు. అక్కడ పెట్టిన తరువాత అది ప్రసాదంగా ఎంచబడుతుంది.
కానీ Music విషయంలో అలా కాదు. ఎక్కడైతే విగ్రహాలయాలు, విగ్రహం ప్రతిష్టించబడి ఉంటుందో అక్కడ జరిగే పూజలో భాగంగా ఉంటుంది. ఈ సంగీతం ఆ పూజా కార్యక్రమాల్లో ఒక Part గానే వీళ్లు సంగీతం వాయిస్తూంటారు. అందుచేత Christian Musicians విగ్రహలయాలలో జరిగే పూజ కార్యక్రమాల దగ్గర సంగీతం వాయించకపోవడమే మంచిది. వాళ్ల మనస్సాక్షి వాళ్లను సూదిలాగా పొడుస్తుంది. కాబట్టే ఈ ప్రశ్న మనదాకా వచ్చింది. లోలోపల తప్పు చేస్తున్నానేమో అనే భావనను Control చేసుకొనే Music వాయిస్తారు. అలా చేయడం వల్ల లోపల ఉన్న మనస్సాక్షి తప్పు, తప్పు అని అరచి, అరచి మెల్లిగా చెప్పడం కూడా మానేస్తుంది. మనం మనస్సాక్షి నోరు మూయించి అలాగే చేస్తుంటే మనస్సాక్షి తప్పని చెప్పడం మానేస్తుంది. అప్పుడు ఎంత పెద్ద తప్పు చేసినా మనకు తప్పనిపించదు దాన్ని సమర్థించుకుంటాము. దాని తరువాత వ్యభిచారంచేసినా, Murder చేసినా ఇది తప్పు కాదనిపిస్తుంది. అంత నష్టం జరుగుతుంది. ఏదైతే తప్పు అని Bible నిషేధిస్తుందో ఆ ప్రాంతాలకు మనం వెళ్లకుండా అక్కడ జరిగే కార్యక్రమాల్లో మనం Live గా పాలుపొందకుండా ఉంటే మంచిది.