-అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు
జవాబు: అమ్మా! ఎవరు, ఎప్పుడు చచ్చిపోయిన మీరేమనుకోవాలంటే ప్రసంగి 8:8 ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి. గాలి విసరకుండా చేయుటకు ఎవరికిని గాలి మీద అధికారము లేదు. ఒకని మరణ దినము ఎవనికి వశము కాదన్నాడు ప్రసంగి 8:8లో. ఒకని మరణ దినం ఎవనికి వశం కాదు. గనుక దేవుడు మనం తల్లిగర్భంలో ఉన్నప్పుడే మనం జీవించాల్సిన దినాలు, ఒకదినమైన జరుగక ముందే మన దినములన్ని ఆయన గ్రంథంలో వ్రాయబడ్డవట! గనుక అంత భక్తిపరుడి జీవితంలో ఆ మరణ దినం కూడా వ్రాయబడే ఉంటుంది, కదా! దేవుని Diaryలో. గనుక ప్రభు చిత్తం లేనిది ఒక తలవెంట్రుక అయినా రాలదు అన్నాడు. ప్రాణం ఎలా పొతుంది? గనుక మీరు జరిగిపోయిన దాని గురించి బాధ పడకుండా…. అతడు ఎలా మరణించాడు Accident ఆ. యవ్వనస్తునిగానా, ఎక్కువ వయస్సా అనేదంతా ప్రక్కన పెట్టి ఆయన కడవరి శ్వాస పీల్చి వదలక ముందు రక్షణ పొందాడు మనకు అంతే చాలు. రక్షింపబడి పోయాడు గనుక ధన్యుడే. రక్షణ లేకుండా 90, 100 సంవత్సరాలు బ్రతికినా వ్యర్థమే కదా!