(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: ఏం సాధించారు అని మీరు అడుగుతున్నారు. ఈ మధ్య మీడియాలో కూడా మీరేం ఉద్దరించారు అని నన్ను అడిగారు. దీనికి సమాధానం చెబుతున్నాను. ఏం ఉద్దరించాలి? ఏం సాధించాలి? అనేది నా ప్రశ్న. మేం పార్టీ పెట్టాం. ఎమ్మేల్యేలను, యం.పి.లను చట్ట సభలకు పంపించలేకపోయాం. మునుముందు ఇంకా బెటర్ పర్ఫామెన్స్ ఇస్తాం. ప్రజాస్వామ్య ప్రక్రియలో గెలుపోటములు అనేవి సహజం. గనుక మేం ఒకే ఒక్క అటెంప్ట్ అసెంబ్లీలో,పార్లమెంట్లో ప్రవేశించలేదు అనే బాధ మాకేం లేదు. కానీ బి.ఆర్. అంబేద్కర్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పార్టీ పెట్టారు. వారు ఒక్కసారైనా అధికారంలోకి వచ్చారా? అంటే రాలేదు. దళితులందరికీ ఆయన ప్రాతినిధ్యం వహించి, దళితుల ప్రాతినిధ్య పార్టీగా ఆయన పార్లమెంట్లో మెజారిటి సీట్లు సాధించి బాబా సాహెబ్ ప్రధానమంత్రిగా ఒక్క టర్మ్ అయినా భారతదేశాన్ని పాలించి ఉంటే భారతదేశ చరిత్రే వేరుగా నడిచేది. ఇప్పుడు మతోన్మాదం, మతం, పేరిట గొడవలు, చంపడాలు, మాన భంగాలు ఉండేవే కావు. కానీ ఆ మహానుభావున్ని ప్రధానమంత్రి కానివ్వలేదు. ఉన్న న్యాయశాఖామంత్రి పదవి కూడా ఆయన రిజైన్ చేసాడు. ఎందుకంటే దళితులకు, మహిళలకు అనుకున్న న్యాయం చేయలేకపోతే నాకు ఈ పదవి కూడా అవసరం లేదని ఆయన రిజైన్ చేశాడు. మరి ఆ పార్టీకి ప్రస్తుతం ఎన్ని సీట్లు ఉన్నాయి? తరువాత అయినా ఆ పార్టీ అధికారంలోకి వస్తుందా? అంటే అసలు నామమాత్రంగానే ఉంది. అంతట మహానుభావుడు పెట్టిన పార్టీకే ఆ పరిస్థితి వచ్చినప్పుడు మరి మీరు ఏం సాధించారు? ఏం ఉద్ధరించారు? అని అడిగితే. ఇప్పుడు ఉద్దరించలేదు. కానీ మునుముందు సాధిస్తాము, ఉద్దరిస్తాము. వర్తమాన రాజకీయాలను చూడాలి అందరూ. ఇవాళ పెద్ద పెద్ద రాజీయ పార్టీలే (నేషనల్ పార్టీలే) నామరూపాలు లేకుండా పోయాయి. ఎలక్ట్రిక్ ఓటింగ్ మెషిన్ల వల్ల గెలిచారు. ఈ గెలిచిన వారి మీద సుప్రీంకోర్టుల వరకు వెళ్ళారు. అందుచేత రాజకీయ ప్రక్రియలో ఒక ఎన్నికల్లో గెలవకపోయినంత మాత్రాన మొత్తం వేస్ట్ కాదు. బాబా సాహెబ్ అంబేద్కర్ పార్టీ వేస్ట్ అని మనం అనగలమా? అనలేము కదా? ఉత్తరప్రదేశ్లో కాన్షీరాం గారు 4 సార్లు తమ బి.యస్.పి. పార్టీని గెలిపించుకున్నాక, యూ.పి.లో బి.జె.పి. ప్రభుత్వం వచ్చింది. బి.యస్.పి. పార్టీ, కాన్షీరాం గారు వేస్ట్ అనలేము కదా? గెలుపోటములు అనేవి రాజకీయాలలో సహజం. మేము సాధించింది ఏమిటంటే, మేము పార్టీ పెట్టి 2,3 నెలల్లోనే రాజకీయ ఎన్నికల్లో పోటీకి దిగాము. పార్టీ కండువాలు తెచ్చుకోవడానికి 2,3 లక్షల రూపాయలు లేని వాళ్ళం. అయినా చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని ఒక నియోజకవర్గంలో 8000 ఓట్లకి మా అభ్యర్థికి 6000 ఓట్లు వచ్చాయి. ఎన్నికల సమయంలో డబ్బు ప్రవాహంలాగా ప్రవహించే సమయంలో, ఒక్క రూపాయి కూడా పంచకుండా ఇన్ని ఓట్లు సంపాదించగలిగాం అంటే ఇంకా ముందు 60,000 ఓట్లు, 6,00,000 ఓట్లు కూడా సంపాదించగలుగుతాం ఇదే మా పార్టీ సాధించిన విజయం.