(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: దీని విషయం చెప్పాలంటే “విశ్వచరిత్ర” అనే గ్రంథం ఎలా రాసానో అలాగే నా అప్పు చరిత్ర అనే గ్రంథం కూడా చాలా పెద్ద గ్రంథం రాయాల్సి వస్తుంది. వాస్తవాల పట్ల ఎవరికైనా ఆసక్తి ఉంటే ఇందులోనుండి కూడా ఎన్నో పాఠాలు నేర్చుకొని ఎంతో అద్భుత క్షేమాభివృద్ధి పొందే అవకాశం ఉంది. లేదు విమర్శించాలి, అవమానించాలి అనే ద్వేష పూర్వకమైన వైఖరి పెట్టుకుంటే వాళ్లకు క్షేమాభివృద్ధి ఉండదు. వాళ్లతో సంభాషించుట కూడా మనకు వృథా కాలయాపన. వాస్తవానికి ఒక్క రూపాయి అప్పు కూడా నా అక్కర కొరకు నేను చేయలేదు. ఇది మొదటి విషయం. రెండవది ఏమిటంటే నేను అప్పు చేసినట్టు ఎక్కడా కాగితంగానీ పత్రంగానీ లేదు. మరి అప్పులున్నాయి అని ఎందుకంటున్నారు అంటే నేను ఒక అనాథ అమ్మాయికి పెళ్లి చేయాలని పూనుకున్నాను. దానికి 4-5 లక్షల ఖర్చు అయింది. అన్నగారు మీరు ఇంతమంచి పనికి పూనుకున్నారు. మా వంతు మేము కొంత డబ్బు మీకు ఇస్తాము అంటే “మంచిది నేను మళ్లీ కొన్ని నెలల్లో మీకు ఇచ్చేస్తాను” అని చెప్పి వాళ్లు ఇచ్చిన డబ్బులతో వివాహం చేసేసాం. తర్వాత వాళ్లు మేము ఇళ్లు కట్టుకోవడానికి ఆ డబ్బులు దాచుకున్నాం పాస్టరుగారు మీరు మళ్లీ ఇస్తాం అన్నారు కదా మరి ఇల్లు కట్టుకునే టైం వచ్చింది, అని అంటే నా కారణంగా వాళ్ల ఇల్లు కట్టడం ఆగిపోకూడదని మనసాక్షిని బట్టి బాధపడి ఇంకోచోట నుండి తెచ్చి వీళ్లకు ఇచ్చేవాడిని. ఇలా నేను చేసింది ఈ 25-30 సంవత్సరాల నుండి ఈ అప్పు చరిత్ర Start అయ్యింది. నా పుస్తకాల ప్రింటింగ్ కి డబ్బులు ఇస్తానని కొందరు చెప్పడం ఆ ప్రింటింగ్ కి ఇచ్చాక వెనకకు వెళ్లిపోవడం ఇలా కొంత జరిగింది. ఎక్కడా కూడా నేను నా అవసరం కొరకు అప్పు చేయలేదు. ఎవరైనా నాకు అప్పుగా ఇచ్చిన వాళ్లు నా నోటి మాటగా ఇచ్చారు. కానీ 10, 20, 30 ఏండ్ల కిందట నేను ఇచ్చిన నా నోటిమాట దానికి నేను కట్టుబడి యున్నాను. అయ్యో నేను నా మాట తప్పిపోయింది అని బాధపడి మదన పడుతుంటే నా శిష్యులు చూసి మా ఆత్మీయ తండ్రి బాధపడి ఆరోగ్యం పాడవుతుంది మనం ఆయన ద్వారా ఎంతో మేలు పొందాం. గనుక తలా ఒక 50వేలు, లక్షా వేసుకుంటే ఆ అప్పు తీర్చేయవచ్చు అని ముందుకు వచ్చారు. ఒక క్రైస్తవ నాయకుని కొరకు ఇన్ని వేల మంది శిష్యుల అప్పు నిర్మూలన చేసి మా గురువుగారికి మేము ఇవ్వాలని నిరుపేదలు సహా తమకున్న ఇండ్లు భూములు వాహనాలు బంగారం, అమ్మేసి గురువుగారి అప్పు తీర్చాలని వచ్చిన సంధర్భం ఇది మొట్టమొదటిది. అని నేను అనుకుంటున్నా. ఇక్కడ, the beauty of the whole issue ఏమిటంటే నేను నా కొరకు అప్పుచేయలేదు. నేను చేసిన పుణ్యకార్యాలకు మీరు ఇచ్చారు. నన్ను క్షమించి వదిలేసేయండి. దేవుడు మీకు ఇస్తాడు నా దగ్గర డబ్బులు లేవు అవడానికి అవకాశం ఉన్నా నేను అనలేదు. నేను నా మాట మీద నిలబడ్డాను. నా శిష్యులు కూడా మా ఆత్మీయ తండ్రి ఇంత యదార్థంగా విశ్వాసపాత్రుడిగా మాట నిలబెట్టుకోవాలని రోషంగా నిలబడ్డాడు. ఆయన మాట మేం నిలబెడతాం అని చిన్నపిల్లల నుండి వృద్ధులదాకా అందరూ contribute చేసారు.
