65. ప్రశ్న : క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారు కృపామయుడుగా కనబడుతున్నారు అయితే పాత నిబంధనలో సంఖ్యాకాండంలో ఇశ్రాయేలీయుల మీదికి పాములను పంపించి చంపిస్తాడు? మిద్యానీయులతో వ్యభిచారం చేసినప్పుడు ఉరివేయమంటాడు కొంతమందిని. ఈ విధంగా చనిపోయిన వారంతా నరకానికి వెళ్తారా? పరలోకానికి వెళ్తారా? ఆ టైంలో వెంటనే శిక్ష వచ్చింది కానీ ఈ టైంలో వెంటనే శిక్ష రావడం లేదు. దేవుడు అప్పుడలా ఇప్పుడిలా ఎందుకు ఉన్నాడు?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: దేవుని వ్యక్తిత్వంలోని చక్కదనం సౌందర్యం ఏమిటంటే కొన్ని పాఠాలు నేర్పడానికి కొంతమందిని పాతనిబంధనలో కఠినంగా శిక్షిస్తూ కూడా వారు అజ్ఞానదశలో చేసిన పాపాలకు నిత్యత్వమంతా శిక్షించవద్దు అన్నటువంటి తండ్రి హృదయాన్ని కూడా దేవుడు చూపించాడు అని already నా messages లో చెప్పాను. మళ్లీ చెప్తున్నాను. 1 పేతురు 3:20 దేవుని దీర్ఘశాంతము ఇంక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ద పరచబడుచుండగా, అవిధేయులైనవారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మలయొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను ఆ ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణపొందిరి. యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడిన తర్వాత ఆయన భూమియొక్క కింది స్థలములకు దిగిపోయెను. అని ఎఫెస్సీ 4:9లో చెప్తాడు. ఆయన సిలువ మీది దొంగతో నేడు నీవు నీతో కూడా పరదైసులో ఉందువు అని చెప్పాడు. మరణించిన తర్వాత తండ్రీ, నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నా అని చెప్పి శరీరం సమాధి చేయబడి ఆత్మ భూమి క్రింది భాగాలకు దిగి వెళ్లిపోయింది. పరదైసు అనేది అప్పుడు అక్కడే ఉండేది. అక్కడికి వెళ్లి ఆత్మరూపిగా సువార్త ప్రకటించాడు. అని ఉంది. అక్కడ ఉన్నవాళ్లు ఎవరంటే పూర్వము నోవహు దినములలో అవిధేయులైన వారి యొద్దకు కూడా వెళ్లి ఆయన వారికి సువార్త ప్రకటించాడని ఇక్కడ చెప్పబడుతుంది. అంటే వాళ్లు అవిధేయులుగా నీటి వరదలో మునిగి చనిపోయారు గనుక వాళ్లకు నిత్యమైన అగ్నిగుండపు శిక్ష దేవుడు వారికి నియమించి యుంటే యేసు వాళ్లతో పరదైసుకు వెళ్లి మాట్లాడే అవసరం లేదు కదా! గనుక దీనిబట్టి పాత నిబంధనలో దేవుడు కొంతమందిని తప్పు చేయగానే చంపేసాడు. అంటే 1 కొరింథీ 10:11లో “ఈ సంగతులు వారికి దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున్ను మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను”. క్రొత్త నిబంధన సంఘంలో ఉన్న మనం జ్ఞానం తెచ్చుకోవడానికి వాళ్లను దేవుడు శిక్షించాడు. ఈ సంగతులు వాళ్లకు సాదృశ్యంగా జరిగినది. వాళ్లు శిక్షను అనుభవించి మనకు దృష్టాంతాలుగా మారారు. మరి వాళ్ల నిత్యత్వం ఏమిటంటే వాళ్లలో మనసాక్షి ప్రకారం తెలిసినంతలో దేవునికి భయపడి జీవించారని దేవుని ప్రేమలో, కృపలో అనుకున్నవాళ్లకు అలాగు శిక్షింపబడి చనిపోయిన వాళ్లలో కొంతమందిని కూడా మనం పరలోకంలో చూస్తాం. క్రొత్త నిబంధనలో లేఖనాలు సంపూర్ణంగా ఉన్నాయి. వాళ్లకు లేఖనాలు సంపూర్ణంగా లేవు. వాళ్లకు కాపరులు, సంఘాలు, క్రమ శిక్షణ లేవు, ఆ రోజుల్లో వాళ్ళకులాగా తప్పు చేయగానే శిక్ష ఈ రోజుల్లో రావడం లేదు అంటే దానికి రెండు కారణాలు. 1. లవొదకయ సంఘంలో ప్రభువు “నేను ద్వారము యొద్ద నిలిచియుండి తలుపు తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం వినితలుపు తీస్తే లోపలికి వస్తాను అన్నాడు. ఈ నాటి సంఘాలు అన్నీ వాఖ్యానికి భిన్నంగా జీవించి, దేవుని సేవను వ్యాపారంగా మలచి, దేవునికి దుఃఖ కరమైన కార్యాలు చేస్తున్నందుకు (ఇక్కడ ఈకాబోదు అని) సమూయేలు కాలంలో ప్రభావం వెళ్లిపోయింది. అని చెప్పినట్టు సంఘంలో నుండి ప్రభావం వెళ్లిపోయింది. అందుకే అననీయ సప్పీరాలు కూడా అబద్దం ఆడగానే చనిపోయారు. పాతనిబంధనలోనే కాదు క్రొత్తనిబంధనలో కూడా. మరి అప్పుడే కొత్తగా పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది. అననీయ సప్పీరాలను శిక్షించిన దేవుడు ఈ రోజు పాపం చేసేవారిని ఎందుకు శిక్షించడం లేదు అంటే ఇది కృపా కాలం అని కాదు. ప్రభావం వెళ్లిపోయిన కాలం. ఉజ్జీవం మళ్లీ వచ్చినప్పుడు. అననీయా సప్పీరాలకు వచ్చినటువంటి శిక్ష సంఘంలోని రహస్య పాపులందరికీ వస్తుంది.