14. ప్రశ్న : నేను చదువుకునేటప్పుడు కొన్ని పాపాలు చేసాను యేసును తెలుసుకున్నాక అన్నీ వదిలేసాను. వదలి పెట్టాక కొన్ని నెలలు బాగానే ఉంటుంది ఆ తర్వాత తీవ్రమైన శోధన వస్తుంది దాని జయించడం ఎలా?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు: ఒకప్పుడు మనం ఎన్నో తప్పులు చేసాము యేసు లోనికి వచ్చాక పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నిస్తాము. అపో. 2:42లో చెప్పబడిన 4 విషయాలు మీరు తప్పకుండా చేస్తే ఒక్కరోజులోనే మీకు మార్పు రాకపోవచ్చు గాని క్రమక్రమేణా తప్పక మీరు ఈ సుడిగుండం నుండి బయటికి వస్తారు. ఆ నాలుగు ఏంటంటే అపోస్తులుల బోధ, రొట్టె విరుచుట, సహవాసము, ప్రార్థన చేయుట. ఈ నాలుగు regular గా చేసే సంఘాలను సంప్రదించి ప్రతి ఆదివారం వెళితే, మొదటి శతాబ్దంలో అపోస్తులు చేసిన ఆ బోధనే మనం వింటూ ఉంటే, ప్రతి ఆదివారం సరియైన విధంలో క్షమాపణ పొంది ఆయన శరీర రక్తాలలో పాలుపొందితే, పరిశుద్ధుల సహవాసంలో ఎక్కువగా ఉంటే, వ్యక్తిగత ప్రార్థన సంఘ ప్రార్థన నిర్లక్ష్యం చేయకుండా ప్రార్థనలో కొనసాగితే, first of all మీకు శోధన రావడానికి అవకాశం ఉండదు. వచ్చినా దాన్ని గెలిచే మనోబలం, సంకల్పబలం దేవుడు మీకు ఇస్తాడు. పరిశుద్దాత్మ దేవుడే మీలో ఉండి ఆ యుద్ధం చేసి, మీకు జయం కలుగజేస్తాడు. We don’t expect sinless perfection instantaneously. నమ్మి బాప్తిస్మం పొందగానే ఏ పొరపాటు చేయని సంపూర్ణ పరిపూర్ణత వస్తుందని బైబిల్ చెప్పలేదు. దానికి టైం పడుతుంది. యాకోబు 3:2 “మనమందరము అనేక విషయములలో తప్పిపోవుచున్నాము”. గనుక ఒక్కసారైనను తప్పుచేయని భక్తుడెవడూ లేడు. ఒక్కసారైన తప్పు చేయనివాడు ఎవడైనా ఉంటే వాన్ని భక్తుడు కాదు దేవుడు అంటాం. గనుక మీరు అలాగా బాధపడకండి తప్పక దేవుడు జయజీవితం ఇస్తాడు.