4 ప్రశ్న : యేసు ప్రభు వారు అవతరించకముందు రక్షణ ఎలా? కేవలం ఇశ్రాయేలు, యూదులకేనా? అన్యులకు కూడా ఉన్నదా?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు: ఈ విషయాన్ని నేను “మహిమ ప్రపంచం” అనే నా గ్రంథంలో వ్రాసాను. యేసుక్రీస్తు ప్రభువారు అవతరించడానికి ముందు ఉన్నవారికి కూడా రక్షణ వారి మనసాక్షిని బట్టి ఉంటుందని రోమా 2వ అధ్యాయంలో పౌలు వ్రాసాడు. గనుక, అంతకముందు ఇశ్రాయేలీయులు మాత్రమే పరలోకానికి వస్తారు. అన్యులందరూ నరకానికి వెళ్తారు అనేది కాదు. అది చాలా తప్పు. నా “మహిమ ప్రపంచం” అనే గ్రంథంలో క్రీస్తుకు ముందు ఉండి రక్షణపొందిన అన్యులున్నారు, ఇశ్రాయేలీయులుగా ఉండి రక్షణపొందిన వారున్నారు అని వివరించాను. ఇశ్రాయేలు జనాంగమే లేకముందు రక్షణపొందిన అన్యులున్నారు. గనుక, అసలు దేవుడు వీరు వారు అని కాదు రక్తప్రోక్షణాచారమును ఆచరించిన వారు, నా స్వయంకృషి చేత నీతిమంతున్ని కాలేను, దేవుని కృపే నాకు ఆధారం, యజ్ఞమే ఆధారమనే ఆ విశ్వాసం ఆదాము నుండి ఉంది. అందుచేత పాతనిబంధన కాలంలో యూదులు కానివారు అనేక మంది రక్షణ పొందారు. పరలోకంలో మనం వారిని కలుసుకుంటాం. మరిన్ని వివరాలకు నా గ్రంథం “మహిమ ప్రపంచం” చదవండి.