(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: నేను 18 ఏళ్ల వయస్సులో ఈ.సి.ఐ.ఎల్. లో చెప్పాను. నేను ఈ.సి.ఐ.ఎల్ లో ఉద్యోగిని నాకు Ghazals, పాటలు అంటే చాలా ఇష్టం. నేను బాల్యంలోనే ప్రభువును హృదయంలో చేర్చుకున్నాను. పదేళ్ల ప్రాయంలో పరిశుద్ధాత్మను పొందాను. పదిహేను ఏళ్ల ప్రాయంలో బాప్తిస్మం పొందాను. 18 ఏళ్లకు నాకు ఈ.సి.ఐ.ఎల్. లో జాబ్ వచ్చింది. 3 సంవత్సరాలు జాబ్ చేసాను. 21 సంవత్సరాలకు resign చేసాను. దేవునితో నడుస్తున్న అనుభవాలు ఉన్నవి. కానీ సంగీతం అంటే ఇష్టం ఈ.సి.ఐ.ఎల్ లో నా మిత్రులు నాతో ఘంటసాల గారి పాటలు పాత పాటలు పాడించుకునేవారు. ఒకరోజు యేసుప్రభువారు నన్ను గద్దించారు. నన్ను మహిమ పరచవలసిన నీ స్వరం ఈ సినిమా పాటలు పాడుతుంది. అది నాకు నచ్చలేదు అని అన్నారు. తప్పు అని నాకు తెలీదు ప్రభువా! నువ్వు వద్దంటే మానేస్తాను కదా అని అన్నాను. అంటే నా రక్తం ఇచ్చి నీ పెదవులను, నాలుకను కొనుక్కున్నాను నన్ను గూర్చి నీవు పాడాలి అన్నాడు. ఇది మంగళవారం జరిగింది next day tea time లో అందరూ పాటపాడమని నన్ను అడిగారు. నేను పాడను నా ప్రభువు పాడవద్దు అన్నాడు అని చెప్పాను. నేను నా ప్రభువును గూర్చి మాత్రమే పాడతాను. లోకసంబంధమైనవి పాడను అన్నాను. అందుకు వారు నువ్వు ఏదైనా పాడు నీ స్వరం బాగుంటుంది. నువ్వు పాడే విధానం బాగుంటుంది. గనుక నీవు నీ దేవుని గురించే పాడు. మాకు కావాల్సింది సంగీతం అన్నారు. అప్పుడు వాళ్ల కొరకు “సందియమేలకో నరులారా” అనే పాట అప్పటికప్పుడు వాళ్లకు సువార్త చెప్పడానికి ఆ పాట రాసి, పాడాను. దాంట్లో యేసు ప్రభువు ఎందుకు దేవుడు? మిగతావాళ్లు ఎందుకు మోక్ష మార్గం కాదు? యేసే ఎందుకు మోక్ష మార్గం? అని అన్ని కోణాల్లో, అన్ని objections కు సమాధానాలిస్తూ అందులో చెప్పాను. అది విన్నప్పుడు వాళ్లకు అర్థమయ్యింది. వీడు వీని మతం మనకు ఎక్కించాలని fix అయ్యాడు. అని పాట పాడుతున్నాడు. గానీ మా దేవతలు రక్షణ ఇవ్వజాలవు. అయన నమ్ముకున్న యేసు దేవుడే ఇస్తాడు. ఈ point నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని అర్థమైపోయింది. ఒకప్పుడు ఒకరు వచ్చి ప్రసాదం తినమని బలవంతం చేసారు. నేను వద్దన్నాను. గొడవైంది. కొడతాము, చంపుతాము అన్నారు. ఈ సందర్భాల్లో 100-200 మందిని lunch time లో నేను bench మీదికి ఎక్కి నిలబడి నేను ఎందుకు యేసును నమ్ముకున్నాను, యేసే ఎందుకు దేవుడు అని చెప్పే కొన్ని అవకాశాలు వచ్చాయి. 21 ఏళ్ల వయస్సులో resign చేసినప్పుడు అందరూ అడిగారు. ఎందుకు resign చేస్తున్నావు? అని. దేవుడు చెప్పాడు అని నేను అన్నాను. నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఇదంత భ్రమ, కల అని వాళ్లు అన్నారు. ఎప్పుడైతే నేను resignation submit చేసానో ఆ రోజుకూడా టీ టైంలో 200 మందికి సువార్త చెప్పాను. ఇంక ఆ తర్వాత వీధి ప్రసంగాలు మొదలుపెట్టాను. అది కూడా అపట్లో డి. ఆర్. కొత్తపల్లి ప్రమోదన్ జాషువ గారు ఆయన Iran లో English teacher job వదిలేసి ఇండియాకి వచ్చి ఆయన మాతో సైకిల్ మీద మా టీంతో వచ్చారు. ఒకొక్క junction దగ్గర మా టీం లీడర్ “ఆశీర్వాదం” అన్న ఆగమని చెప్తాడు. ఎవరో ఒకరిని వాక్యం చెప్పమని అనేవారు. అప్పట్లో నేను బోధకుడిని కాదు Harmonist ని. ఒక సారి ఒకచోట sudden గా Next junction లో నువ్వు వాక్యం చెప్పాలి. సువార్త చెప్తావా? అన్నారు. ఆ సరే అన్నఅని అనేసాను. ఆ తర్వాత ఏంటి సరే అనేసాను! ఎప్పుడు ఇంత public గా వాక్యం చెప్పలేదు అనుకున్నాను. Junction దగ్గరికి రాగానే అన్నగారు వాక్యం చెప్పమన్నారు. Harmonium క్రింద పెట్టి బైబిల్ అందుకున్నాను. నా Mind blank అయిపోయింది. బైబిల్ తీస్తాను అందులో ఏ వచనం వస్తే దాని గురించి చెప్తా అని అనుకున్నాను. Open చేసేసరికి బైబిల్ అంతా ఒక్క side వెళ్లిపోయింది. ఇంకో side కేవలం ఒక్క అట్ట మిగిలింది. భయపడుతూ అటు చూస్తే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని వచ్చింది. దాని మీద దృష్టి పడింది. నా మీదికి ఏ శక్తి వచ్చిందో తెలీదు. “ఇదిగో నేను అంటే ఎవరో పరిచయం ఉన్న వ్యక్తిలా ఉన్నారు. నేను అనగానే అందరూ గుర్తుపడతారు అనే నమ్మకంతో చెప్తున్నాడు. నేను వచ్చాను ఇంతకముందు మళ్లీ వస్తాను అంటున్నాడు. ముందు ఎందుకొస్తాడు? మళ్లీ ఎందుకొచ్చాడు? అని రెండు రాకడలను గూర్చి ఒక అర్థగంట చెప్పాను. మొదటి సారి మన పాపాల గురించి మరణించడానికి వచ్చారు. రెండవసారి ఆయనను నమ్మని వాళ్లను శిక్షించడానికి వస్తాడు. అని చెప్పాను. మా టీం Members అందరూ దిగ్భ్రాంతిపొంది అలాగ నిలబడి, ఉండిపోయారు. ఇరాన్ నుండి వచ్చిన Dr. Joshua గారు అన్నారు. నాకు వరసకు ఆయన మామయ్య అవుతారు. ఆయన నాతో “అల్లుడు చాలా బాగా చెప్పావు. నీలో ఒక బోధకుడు ఉన్నాడు అన్నాడు. ఆయన అప్పుడు నేను కూడా బోధకుడిని అవ్వొచ్చు అని ధైర్యం వచ్చింది. అప్పుడు suddenly ఓఫీర్ became a big preacher. మొట్టమొదటి stage ప్రసంగం మాత్రం BHEL లో గాస్పల్ చర్చ్. ఆ చర్చి Anniversary కి నన్ను పిలిచారు. ఇలా సేవ చేస్తూ ఉండగా దేవుడు అంతకంతకు వాడుకున్నాడు. అలా దేవుడే నడిపించాడు తప్ప నా వెనక God father ఉండి, సంస్థ ఉండి నన్ను promote చేయలేదు.