(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: యేసేపు మీద అన్నలకు ఎందుకు వ్యతిరేకత వచ్చిందో నా మీద కూడా మా అన్నలకు అందుకే వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు నాకు నా family life disturb అయ్యింది. గనుక నా life బాలేదు, testimony బాలేదు అంటున్నారు. మరి నాకు పెళ్లే కాకముందు? అప్పుడెందుకు ద్వేషించారు? నేను రాసిన రచనలు రెండవ రాకడ విషయంలో నా గ్రంథాలను బట్టి pre-tribulation వాళ్లందరూ నన్ను ద్వేషిస్తున్నారు. నేను 3సం||ల శ్రమల తర్వాతే సంఘం ఎత్తబడుతుందని చెబుతున్నా గనుక వాళ్లు నన్ను ద్వేషిస్తున్నారు. మరి ప్రకటన గ్రంథం యొక్క ప్రత్యక్షత నేను పొందకముందు, సిద్దాంతాలే మాట్లాడకముందు, ఎందుకు ద్వేషించారు? ద్వేషానికెప్పుడూ కారణాలు ఉండవు ద్వేషము fundamental. ఒకరి మీద మనకు ద్వేషం ఉన్నప్పుడు మన మనసాక్షి మనల్ని తప్పుపడుతుంది. గనుక మన మనసాక్షి నోరు మూయించడానికి మనం కొన్ని కారణాలు వెత్తక్కుంటాం. దావీదు అంటాడు కదా “నిర్నిమిత్తముగా నా మీద పగబట్టువారు, నిర్హేతుకముగా నన్ను తరుమువారు ఎందరో ఉన్నారు” అని గనుక యోసేపు, దావీదు, పౌలు, యేసు కూడా ద్వేషింపబడ్డారు. మరి ఎందుకు అంటే? ముందు వీళ్లందరూ ఎందుకు ద్వేషింపబడ్డారో చెప్పండి అప్పుడు నా లెక్క చెబుతాను.