71 ప్రశ్న : ప్రారంభంలో మీరు సంఘం ప్రారంభించింది ఎక్కడ? ఏ సంవత్సరంలో? ordination పొందినాకే ప్రారంభించారా?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: మొదట నేను చర్చి పెట్టింది నకిరేకల్ లోనే That was in 1981. అసలు నా మొదటి రోజు నుంచి నేను అభిషేకించబడినవాణ్ణి. ఎలా జరిగిందంటే దేవుడు నన్ను పిలుస్తున్నాడు. అది స్పష్టంగా కావాలని ప్రార్ధన చేసాను. పదిరోజులు ఉపవాస ప్రార్ధన చేసాను. పదిరోజులు అయ్యాక దేవుడు నాతో మాట్లాడడం లేదు. గనుక ప్రాణం తీసేసుకో అని అప్పగించుకున్నా. అప్పుడు దేవుడు మాట్లాడాడు. మళ్లీ దేవుడిని అడిగా ఇప్పుడు నువ్వు మట్లాడుతున్నావు. ఇది నువ్వో కాదో? భ్రమో? నాకు ఎలా తెలుస్తుంది? నాకు తెలియని? ఒక అపరిచితుడిలోనుండి నాకు ప్రవచనం రావాలి అని ప్రార్థన చేసినప్పుడు, అప్పుడు నేను రాక్ చర్చి మాసబ్ ట్యాంక్ ఫిలిప్ అబ్రహామ్ గారు వచ్చి ఓఫీర్ బాబు సువ్వు తల్లి సంఘం వదిలిపెట్టి వెళ్ళిపోయావు. ఇప్పుడు 1980 ఫిబ్రవరి మన చర్చి Godbless you కింగ్ కోటి మస్రత్ మంజిల్ అనే కమ్యునిటీ హాల్లో ఉంది. నువ్వు choir లీడ్ చేయాలి. నాకు సహాయం చేస్తావా అని అడిగారు. నేను నాకు బాప్తిస్మం ఇచ్చిన తండ్రి మీరు తప్పకుండా వస్తాను అని వెళ్ళి, మళ్ళీ టీం అంతా తయారు చేసి పాటలు నేర్పించి choir orchestra తయారు చేసాం. అప్పుడు 1980 ఫిబ్రవరిలో పాస్టర్ భాస్కర్ డాసన్ గారు నా మీద ప్రవచనం చెప్పారు. చెప్పినప్పుడు అక్కడ కె.ఆర్. డేవిడ్ గారు, జాన్ పురుషోత్తం గారు ఉన్నారు. దాదాపు 25 మంది ఐ.పి.సి. సీనియర్ నాయకులు, పాస్టర్స్ ఉన్న ఆ సభలో భాస్కర్ డాసన్ గారు ప్రవచనం చెబితే నేను నమ్మలేదు. మీటింగ్ కాగానే ఆయన నా దగ్గరికి వచ్చారు. బ్రదర్ It is to you the Lord spoke. ఎందుకు అనుమానించావు? అని అన్నారు. నేను వెంటనే షాక్లోకి వెళ్ళిపోయాను. The Lord is commanding to pray for you. Will you allow me to pray? అన్నారు. Please pray అని నేను మోకరించాను. ఆ సభలో ఉన్న పెద్ద పెద్ద పాస్టర్స్ అందరూ వచ్చేసారు. ఎందుకంటే ఆ సభ యొక్క ముఖ్య ప్రసంగీకుడు ఒక కుర్రవాడితో మాట్లాడుతున్నాడు. ఆయన నా మీద చేతులు పెట్టేసరికి ఇక్కడున్న కాపరులు కూడా చేతులు పెట్టారు. దాదాపుగా 25 ఐ.పి.సి. సీనియర్ నాయకులు, బోధకులు నా మీద చేతులు పెట్టి ప్రార్ధించారు. మళ్ళీ నేను నీవు నాతో మాట్లాడాలి. నేను నీ స్వరం వినాలని కనిపెడితే ఆ నెల అయ్యాక మార్చి, 27, 1980 నాడు ఉదయం 10.30 గం॥లకు దేవుడు నాతో మాట్లాడారు. అప్పుడు నేను “యెహోవా నా కాపరి, నేనాయన స్వాస్థ్యంబును” అనే పాట రాసాను. దేవుడు నాతో మాట్లాడింది జాబ్ రిజైన్ చేయమని కన్విన్స్ చేయడానికి. కానీ అంతకు ముందు ఫిబ్రవరిలో పిలవబడ్డాను. ఒక ప్రవక్త ద్వారా ప్రవచనం వచ్చింది. అక్కడ ఆయన, 25 మంది పెద్దలు నా తల మీద చేతులుంచి ప్రార్ధన చేసారు. So, అదే నాకు జరిగిన Ordination service హస్తనిక్షేపణ నాకు ఐ.పి.సి. చర్చిలో జరిగింది.