(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: గ్రంథములన్నిటిలో సాక్షమున్నది గానీ వాస్తవ ప్రపంచంలో చారిత్రికంగా, ఏ ఊరిలో, ఏ పట్టణంలో, ఏ దేశంలో, ఏ కాలంలో, ఏ కాలఘట్టంలో, ఏ తారీఖున ఆ యజ్ఞం జరిగింది అనేది బైబిల్ మాత్రమే మనకు ఖచ్చితంగా Address చెప్తుంది. వేదము చెప్పిందేంటంటే విరాట్ పురుషుడు ఆయన మరణించి మళ్లీ లేస్తాడు, దాని వల్ల పాప పరిహారం కలుగుతుంది అనే మాట ఉన్నది కానీ అది ఎప్పుడు, ఎక్కడ జరిగింది అనేది మాత్రం అక్కడ దొరకదు. గనుక ఇతర గ్రంథలలో చూస్తే యజ్ఞమొకటి జరుగుతుంది ఆ యజ్ఞం ద్వారా మానవులకు రక్షణ కలుగుతుంది అనే సమాచారం మాత్రమే దొరుకుతుంది. అయితే ఆయన ఎప్పుడు ఎక్కడ, ఎలా అవతరించాడు ఎలా జరిగింది అనే చరిత్ర మనకు అందుబాటులోకి తీసుకువచ్చే ఏకైక గ్రంథం “బైబిల్”. గనుక వేదం లేకపోయినా బైబిల్ చదివి రక్షణ పొందగలను. కానీ బైబిల్ లేకుండా కేవలం వేదం చదివితే సాక్షం దొరుకుతుంది కానీ రక్షకుడు దొరకడు అందుచేత బైబిల్ మనకు ప్రామాణికం.