(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: దేవుడు ఏ లోపం లేకుండా ఒకడిని చేయడం అంటే దేవున్ని చేయడమే. ఒక కుమ్మరి వాడు కుండను చేయగలడు. ఇంకో కుమ్మరిని చేయలేడు కదా! సృష్టికర్త అనే పదవి, సృష్టింపబడినవాడు అనే పదవి ఇందులోనే ఎంతో వ్యత్యాసం ఉంది. దేవుడు కలుగునుగాక! అని పలికినప్పుడు ఆయన మానసిక ప్రకంపనలు, ఊహాచిత్రములు అందులో ఆయన ఏ దినుసులు వాడాడో దానంతటిని బట్టి వాళ్ళ క్యారక్టర్, వ్యక్తిత్వం డిజైన్ అవుతుంది. ఉదా|| రకరకాల జంతుజాలమును భూమి పుట్టించును గాక! అన్నాడు. అందులో జంతువులు పుట్టునుగాక అన్నాడు. తప్ప ఏనుగులు తొండం ఉండును గాక! సింహానికి జూలు, చిరుతపులికి మచ్చలు, పెద్ద పులికి సారెలు ఉండును గాక అని అవన్నీ అనలేదు. ఆయన కలుగును గాక అనే ఒక్క మాటలో ఆయన భావచిత్రాలు. కలుగును గాక అన్నప్పుడు ఆయన మైండ్లో ఈ చిత్రం అంతా ఉంది. మనిషి గుర్రం మీద కూర్చుని సవారి చేసినట్టు, కలుగునుగాక అనే మాట మీద ఆయన ఊహలన్నీ కూర్చోబెట్టి వదులుతాడు. అప్పుడు వేరే వేరే జంతువులు వేరు వేరు ఆకారాలలో వస్తాయి. అంటే పలకడం ద్వారా ధ్వని అనేది ఒకటి వచ్చింది. కనిపించకుండా వినిపించకుండా ఉన్న మౌనమైన ధ్వనులు ఎన్నో ఉన్నాయి. దేవదూతలను సృష్టించినప్పుడు కూడా అంతేలేనటువంటి వైవిధ్యంతో సృష్టించాడు. ఈ కారణాలలో ఎవరికి ఏ రూపం వచ్చిందో, ఏ క్యారక్టర్ వచ్చిందో అనేది పెద్ద సబ్జెక్ట్ అది. అది చెప్పడానికి కొన్ని రోజులు పట్టవచ్చు. వినడానికి కూడా చాలా Mental Maturity కావాలి. కానీ Basically దేవుడు కలుగునుగాక అని పలికినప్పుడు వేరువేరు రూపాలతో జంతువులు పుట్టినట్టు. కలుగును గాక అన్నప్పుడు అంతకంటే ముందే వేరు వేరు Characters perfection తో వేరు వేరు level of perfection తో దేవదూతలు పుట్టారు. అందులో ఏ ఒక్కరు కూడా దేవునితో సమానంగా పుట్టలేదు. ఎందుకంటే సృష్టింపబడినవారు గనుక ఏ లోపము లేనివాన్ని చేయాలి అంటే దేవుడు ఇంకొక దేవుడు కలుగునుగాక అని పలకాలి. ఆయన అలా పలకడు ఒకవేళ పలికినా self contradiction అవుతుంది. ఎప్పుడు పుట్టనివాడే దేవుడు. అలాంటి వాడిని చేసినా. ముందు ఈ దేవుని ఉనికికే అర్థం ఉండదు. అంటే నేను అక్కరలేని ఒకడు పుట్టునుగాక అన్నట్టు. దేవుడు ఆ పొరపాటు చేయడు. దేవదూతలలో లోపాలు ఉన్నాయి. ఉన్నా సరే వాళ్ళకు కూడా నేను పరిష్కారం చేస్తాను అనే ధైర్యంతోనే దేవుడు ఆ దూతలను సృష్టించాడు.