(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: యేసు క్రీస్తు నరుడు అనే మాట నేను అనలేదు. అది పౌలు అన్నాడు. 1తిమోతి 2:5లో “దేవుడొక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు అను నరుడు” అది లేఖనం చెబుతుంది. ఆ పౌలే మళ్ళీ రోమా 9:5లో “యేసుక్రీస్తు సర్వాధికారియైన దేవుడు” అని చెప్పాడు. అలాగే తీతు 2:13లో “మహాదేవుడు మన రక్షకుడైన యేసు” అన్నాడు. గనుక పౌలు యొక్క కాన్సెప్ట్ ఏమిటంటే యేసు ప్రభు వారే దేవుడు, యేసు ప్రభు వారు మనిషి కూడా. ఈ రెండు కూడా కలిసిందే యేసు వ్యక్తిత్వం. అందుకే కొలస్సీ 2:2లో దేవుని మర్మమైయున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకొని మీ హృదయాలలో ఆదరణ పొందాలి. క్రీస్తు ప్రభువు అంత simple personality కాదు. He is perfect man and perfect God. But when he died on the cross he died as a man but not as a God. Because God cannot die. So, as a God Jesus didn’t die, But Jesus died on the cross as the Human. కాబట్టి యేసుప్రభువు ఒక angle లో, ఆయన యజ్ఞం అయ్యాడు. యజ్ఞమైన సమయంలోనే మనకు ఆహారమైనాడు. సిలువ మీద ఆయన మరణించకపోతే యజ్ఞం కాలేడు. ఇది మీ కొరకు విరవబడిన నా శరీరం అన్నాడు. అంటే ఆ శరీరం విరవబడకపోతే మనం తినలేము. గనుక ఆ aspect లో యేసు ప్రభు వారు ఒక మానవ మాత్రుడిగా, పరిశుద్ధ మానవుడిగా యజ్ఞం అనే ప్రక్రియను జరిగించాడు. అంతేగాని దేవత్వాన్ని ఆయన వాడుకోలేదు. ఆయన మనిషిగా పుట్టినప్పుడు తన్నుతాను రిక్తునిగా చేసికున్నాడని ఫిలిప్పీ 2:6 చెప్పాడు. తనలో ఉండే మహిమ లక్షణాలను బయట పెట్టేసి ఖాళీ పాత్రగా వచ్చాడు. అసలు అవతారము అనేదే దైవలక్షణాలను పోగొట్టుకోవడం అన్నమాట. ఎందుకంటే అంతటా ఉన్న సర్వవ్యాపకుడైన వాడు ఒక స్థలానికి రావడమే అవతారం. ఒక స్థలానికి వచ్చినప్పుడు దేవుని లక్షణాలతో ముఖ్యమైన సర్వవ్యాపకత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే సర్వవ్యాపకత్వాన్ని వదుతులుకున్నాడో ఇంకా రెండు ఉన్నాయి. 1. సర్వజ్ఞత, 2. సర్వశక్తిమత్వము. ఆ రెండు లక్షణాలను కూడా ఆటోమెటిక్గా ఆయన కోల్పోతాడు. ఇక మిగిలింది నేను పలానా వ్యక్తిని అనే జ్ఞాపకం. ఇంకేదీ ఉండదు. ఆ స్థితిలో ఆయన మరియమ్మ గర్భంలో చిన్న శిశువుగా పుట్టాడు. పుట్టినప్పుడు ఆయన మానవుడిగా పుట్టాడు. అయితే ఆదాము రక్తం అనేది యోసేపు నుండి గానీ మరియ నుండి గానీ రాలేదు. గనుక ఆయన పరిశుద్ధ మానవుడు. He is a human being, not like any other human being. Every other human being is a sinner. ఎందుకంటే ఆదాము రక్తములో పాపం ఉన్నది. యేసయ్యకు ఆదాము రక్తం లేదు. గనుక యేసు ప్రభువు చాలా complex personality కలిగినవాడు. ఆయన గురించి ఒక చిన్న sentence చెప్పడానికి అవకాశం ఉండదు. ఆయన దైవ మానవుడు. ఆయన 100% మానవుడు గనుకనే చనిపోయాడు. దేవుడైతే ఎలా చనిపోతాడు. మానవుడు గనుకనే మానవ బలహీనతలన్నీ ఆయన అనుభించాడు. ఇవన్నీ ఆయన అనుభవించాడు గనుకనే మనకు సహాయము చేయగలవాడైయున్నాడు. గనుక నేను “ప్రభురాత్రి భోజన రహస్యం”లో యేసు ప్రభువారు దేవుడు కాదు అని అన్నాను అంటున్నవారు “పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం”లో యేసుక్రీస్తు దేవుడని నిరూపించాను కదా! ఆ పుస్తకం ఎందుకు చదవలేదు? నేను రాసిన పుస్తకాలన్నీ చదవడం వదిలేసి ఏదో ఒకటి చదివి విమర్శించమని ఎవరు చెప్పారు? అప్పుడు వాళ్ళు అంటారు – మీరు అక్కడ ఒకలాగ, ఇక్కడ ఒకలాగ ఎందుకు రాసారు? అంటారు. నేను ఎందుకు రాసాను అంటే, పౌలు కూడా రెండు రకాలుగా రాసాడు కాబట్టి. పౌలు రోమా 9:5లో “ఆయన సర్వాధికారియైన దేవుడు” అన్నాడు. అదే పౌలు 1తిమోతి 2:5లో ఈయన నరుడు అని కూడా అన్నాడు. గనుక పౌలును కూడా అలాగే తప్పుపడతారా. కాబట్టి అన్నీ చదివితేనే స్పష్టమైన అవగాహన కలుగుతుంది.