(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: దేవున్ని భగవంతుడు అని పిలుస్తాం. భగము అనేది స్త్రీ యొక్క పునరుత్పత్తి అవయవము. ఇంగ్లీష్ Vagina అంటారు. కొన్ని భాషలో “వ”కారము, “భ”కారముగా పలకబడుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ అని మనం అంటాం. బెంగాలీలు, ఇంకొంత మంది రబీంద్రనాథ్ ఠాగూర్ అంటారు. అదే సూత్రం ప్రకారం భగము అనే మాట ఇంగ్లీష్ vagina అయ్యింది. భగవంతుడు అంటే భగము కలిగిన పురుషుడు అని అంటే, దేవుడు పురుషుడు అయినప్పటికీ ఆయనకు భౌతిక శరీరం లేదు. God is a spirit. మహిమలో ఉన్నప్పుడు ఆయనకు శరీరం లేదు. శరీరం లేనప్పుడు మనం ఊహించుకున్నట్లు పురుషాంగము, స్త్రీ అంగము ఆయనకు ఉండే possibility లేదు. కానీ దేవునికి కన్నులు ఉన్నాయి అంటాము. దేవునికి ఎన్ని కన్నులు ఉన్నాయి? దేవుడు అన్నిటినీ చూడగలడు. మన కన్ను ఒక సైడ్ చూస్తూ ఇంకో సైడ్ చూడలేదు. All directions లో చూడగల కన్ను దేవునికి ఎలా ఉందో ఎలా ఊహించుకుంటాం. కోటి మంది ఏక కాలంలో దేవునికి మొర్రపెట్టుకుంటే కోటి మందితో వేరు వేరు భాషలలో దేవుడు ఏకకాలంలో మాట్లాడే ఆ నాలుకను ఊహించుకోగలమా? అంటే ఊహించుకోలేము. గనుక దేవుడు తన పోలికలో మనకు శరీరం ఇచ్చాడంటే దేవునికి చూసే శక్తి ఉంది. ఆ చూసే శక్తి గలిగిన అవయవాన్ని మనకు ఇచ్చాడు. ఆయనకు మాట్లాడే శక్తి ఉంది. ఆ మాట్లాడే శక్తి కలిగినటువంటి ప్రతీకాత్మంగా, ఒక reflection గా మనకు నోరు, నాలుక ఇచ్చాడు. అలాగే సకలమైన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మనలో ఉన్నటువంటి వాటికి సరిపోల్చదగిన, Corresponding powerఏదో ఆ God అనే spirit లో ఉంది. ఆయనకు అనంతమైన శక్తి ఉన్నది. ఆ శక్తి పరిమితంగా కలిగిన ఒక అవయవాన్ని మనకు సృష్టించి ఇచ్చాడు. అలాంటిదే ఈ లైంగిక అవయవాలు కూడా. మన దేహంలో ఉండే అవయవాలన్నిటికీ Corresponding power infinity ఆయనలో ఉన్నది. Infinity measure లో పునరుత్పత్తికి సంబంధించిన ఈ అవయవాలకు సంబంధించిన corresponding power ఆయన లో ఉంది. ఆయన లో actual గా Male organ ఉండదు, actual గా Female organ ఉండదు.కానీ మానవ దేహములో ఈ అవయవాలు ఏ పని చేస్తున్నాయో ఆ పని infinity measure లో చేయగలిగిన, శక్తి కలిగిన భాగము దేవుడనే spirit లో ఉంది. గనుక, ప్రతీకాత్మకమే మానవ దేహము, actual గా సకల జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు దేవుడనే ఆత్మలో ఉన్నాయి. So, దేవుని యొక్క మర్మాంగాలు అనేవి మనం ఊహించుకోకూడదు. అది తప్పు.