(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన గ్రంథం కాదు. పాత నిబంధన కొట్టి వేయబడటం అనేది ఉండదు. Church of Christ వాళ్ళకు ఉన్న confusion అదే. పాత నిబంధన కొట్టి వేయబడింది అని 2 కొరంధి 3వ అధ్యాయంలో ఉంది. ఇప్పటికినీ పాత నిబంధన గ్రంథము చదువునప్పడు, పాత నిబంధన కొట్టివేయబడెనని వారికి తెలీక ముసుగే నిలిచియున్నది అని పౌలు భక్తుడు చెప్తాడు. అక్కడ పాత నిబంధన గ్రంథము చదువునప్పుడు నిబంధన కొట్టి వేయబడెను అంటే నిబంధన అంటే ఒడంబడిక అని అర్ధం. దేవుడు మనుషులతో రెండు ఒడంబడికలు చేసాడు.
- సీనాయి కొండమీద మానవుని యొక్క భౌతికమైన క్రియలు, కర్మకాండ, పూజావిధానాలు, జంతుబలి, రక్తప్రోక్షణ, మనిషి శరీరంలో జరగాల్సిన సున్నతి, ఇలా భౌతికమైన ఆచార వ్యవహారాలతో కూడుకున్న ఒక ఒడంబడిక ఇశ్రాయేలు జనాంగంతో దేవుడు చేసాడు.
- కల్వరి కొండమీద చేసాడు. కల్వరి కొండ మీద చేసిన నిబంధనకు జంతు రక్తం ఆధారం కాదు. దేవుని స్వంత రక్తమే ఆధారం. అక్కడేమో క్రియలు. ఇక్కడేమో విశ్వాసం.
గనుక యుగ ధర్మము మారింది. ఆ నిబంధన యుగం వేరు. ఈ నిబంధన యుగం వేరు. కాబట్టి సీనాయి కొండమీద చేసిన నిబంధన, విధిరూపకమైన ఆజ్ఞలు కలిగిన ఆ నిబంధన కొట్టివేసాడు. కానీ పాత నిబంధన గ్రంథమంతా కొట్టివేయబడింది అని అంటే అది ఎంత Meaningless thought. “ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను” అన్నది కూడా కొట్టివేయబడాలి. “యోహోవానగు నేను సర్వశక్తి గలవాడను” “నా కసాధ్యమైనది ఏదైనా కలదా?” అనే మాట కూడా కొట్టివేసేయాలి. “దేవుడను నేనే, మరియొక దేవుడు లేడు”, “యోహోవా నా కాపరి నాకు లేమి కలుగదు” అనేవి కొట్టివేయబడాలి. అది చాలా stupid thought. గనుక పాత నిబంధన గ్రంథం కొట్టివేయబడడం అనే ప్రశ్నే లేదు. భూమి ఆకాశములు నిలుచునంత వరకు ఒక్క పొల్లైనా గతించదు. గతించింది ఏమిటంటే సీనాయి కొండమీద నిబంధనగా, దేవుడు చెప్పిన ఆజ్ఞలు. అక్కడ జంతురక్తం, సున్నతి చేసినప్పుడు ఒలికేది మానవ రక్తం. దీని మీద ఆధారపడి దేవునికి మానవులకు నిబంధన నిలబడదు. దాని వల్ల ప్రయోజనం లేదు. పాతది కొట్టివేసి కొత్త నిబంధన చేసాడు. సీనాయి కొండమీద covenant పోయి కల్వరి కొండ మీద కొత్త covenant వచ్చింది, తప్ప the scriptures in fact they will remain forever and ever. నిబంధన అనే మాటకు రెండు అర్ధములు. గలతీ 4:29లో “ఈ సంగతులు, అలంకార రూపకముగా చెప్పబడియున్నవి. ఈ స్త్రీలు రెండు నిబంధనలై యున్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును. రెండు నిబంధనలలో ఒకటి సీనాయి కొండ సంబంధమైన నిబంధన అన్నాడు. సీనాయి కొండ సంబంధమైనదైతే యెషయా గ్రంథము సీనాయి కొండమీద వ్రాయబడలేదు కదా! సీనాయి కొండ మీద రాసింది “పంచకాండములు” మాత్రమే. వాటి తరువాత అన్నీ కొండమీద రాయలేదు కిందే రాసారు. కీర్తనల గ్రంధం అక్కడ రాయలేదు కదా! కాబట్టి సీనాయి కొండ సంబంధమైన నిబంధన అన్నప్పుడు రెండు నిబంధనలు అనే మాట ఉన్నప్పుడు, రెండో నిబంధనకు కూడా ఒక కొండ ఉండాలి అదే కల్వరి కొండ. ఈ concept లోకి వాళ్ళు రాలేక పాత నిబంధన కొట్టివేయబడింది గనుక వాయిద్యాలు వాయించవద్దు, అనే non- essential teaching లోకి వెళ్ళిపోయారు. ఈ తప్పుడు సిద్దాంతాలన్నిటికీ కారణం అదే.