(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: నేను ఓఫీర్ మినిస్ట్రీస్లో ఉన్న అగాపే సంఘాలు నమ్మేది ఏమిటంటే వాక్యానుసారమైన ఆరాధన క్రమము దేవుడు మనకు బయలుపరిచాడు. ఆ ఆరాధన క్రమాన్నే అగాపే సంపూర్ణ సువార్త సంఘాలు పాటిస్తున్నాయి. మిగతా వాళ్ళందరూ కూడా ఈ క్రమంలోకి రావాలి అనేది మా నమ్మకం, సందేశం, విశ్వాసం, ఎదురుచూపు ఎన్నో ప్రసంగాలు ఈ విషయం మీద చెప్పాను. ప్రత్యక్ష గుడారములోని ఏడు ఉపకరణాలు అందులో ఆఖరున హెబ్రీ4:16లో “మనమందరము కరుణా పీఠము చేరుదము” అంటాడు. కరుణాపీఠం అంటే last ఉపకరణము గర్భగుడిలో కరుణాపీఠము చేరాలంటే direct గా చేరడానికి కుదరదు. ముందు బలిపీఠము, ఇత్తడి గంగాళము, సన్నిధి రొట్టెల బల్ల, దీపస్తంభము, సువర్ణ ధూపవేదిక, తరువాత రెండవ తెర లోపలికి అతి పరిశుద్ద స్థలములోకి వెళ్ళాక మందసం ఆ తరువాత కరుణాపీఠం. గనుక ఆ last ఉపకరణం దగ్గరికి మనం వెళ్తే సమయోచితమైన కృప మనం పొందగలుగుతాం అని హెబ్రీ 4:16లో చెప్పాడు. నా ప్రసంగాలు, నేను రాసిన గ్రంధాలు చదవండి. మమ్మల్ని follow అవ్వండి. మీకు జవాబు దొరుకుతుంది.