6 ప్రశ్న : ఆదికాండము 7:15 లో “జీవాత్మగల సమస్త శరీరులలో రెండేసి, రెండేసి ఓడలోనున్న నోవహు నొద్ద ప్రవేశించెను”. అని ఉన్నది. జంతువులకు జీవాత్మ ఏమిటి? వివరించగలరు.

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:     Actual గా క్రైస్తవ విశ్వాసమేమిటంటే నరునికి మాత్రమే ఆత్మ ఉన్నది.  మృగములకు ఉన్నది శరీరం, ప్రాణం మాత్రమే గనుక వాటికి నిత్యత్వంలో ఉనికి ఉండదు.  మానవుడు చనిపోయినా నిత్యత్వంలో ఉనికిలో ఉంటాడు ఎందుకంటే ఆత్మ ఉన్నది గనుక.  ప్రసంగి 3:21లో “నరుల ఆత్మ పరమున కెక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో, యెవరికి తెలియును” అని ఉన్నది.  నరుడు మరణించినప్పుడు ఆత్మ పరలోకానికి వెళ్తుంది అని, మృగం చనిపోయినప్పుడు ఆత్మ లేదు గనుక ప్రాణం భూమికి చేరిపోతుంది” అని నమ్మకం.  నరుడికి మూడు భాగాలు శరీరం, ఆత్మ, ప్రాణం మిగతా ప్రాణికోటికి శరీరం, ప్రాణం మాత్రమే ఉన్నదని క్రైస్తవ సిద్ధాంతం.  


     ఆది 7:15 లో జీవాత్మగల ప్రాణులు అని వ్రాయబడింది కదా ! అది Self-contradiction కదా అనేది ప్రశ్న.  అయితే 15లో “జీవాత్మగల సమస్తశరీరులలో…… అని వ్రాయబడింది.  ఆ క్రింద 22లో” పొడి నేలమీదనున్న వాటన్నిటిలోను నాసికా రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నియు చనిపోయెను.” అని ఉంది. జీవాత్మ ఎప్పుడు వచ్చిందో ఆది 2:7లో “దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను”.  అంతకు ముందు మట్టితో చేయబడ్డ శరీరం ఉన్నది కానీ దేవుడు ఊపిరి ఊదినప్పుడు నరుడు జీవాత్మ ఆయెను.  మరి ప్రాణం ఎప్పుడు వచ్చింది? ఆ సంగతి అక్కడ స్పష్టీకరించలేదు.  దేవుడు ఊపిరి ఊదినప్పుడే ఆ మట్టికి ప్రాణమూ వచ్చింది, ఆ ప్రాణము కలిగిన మట్టి దేహములోనికి జీవాత్మ వచ్చింది. గనుక ప్రాణం, జీవాత్మ అప్పుడే వచ్చాయి. గనుకు జీవాత్మ సంబంధమైన ఊపిరి అంటే ఆత్మకు ప్రాణానికి దగ్గరి సంబంధం ఉంది.  హెబ్రీ 4:12లో “ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలగను విభజించునంత మట్టుకు దూరుచు, హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.” అని ఉన్నది.   అంటే ఆత్మ ప్రాణమును విభజించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే అవి కలిసి పోయాయి.  ఎందుకంటే దేవుడు ఊదిన ఊపిరికే ప్రాణము వచ్చింది, ఆత్మ వచ్చింది.  

     అయితే మిగతా వాటికి ప్రాణమే వచ్చింది ఆత్మ రాలేదు అనే సంగతి బైబిల్ స్పష్టీకరిస్తుంది. అందుచేత, అక్కడ జీవాత్మ ఉన్నది అంటే వాటికి చనిపోయిన తర్వాత కూడా Continue అయ్యే spirit ఉన్నదని కాదు.  జీవాత్మ అని ఎందుకన్నాడు అంటే జీవాత్మ సంబంధమైన ఊపిరి వాటికున్నప్పుడు ఆ ప్రాణముతో ఆత్మయొక్క కొన్ని లక్షణాలు కూడా ఉంటాయి. ఎప్పుడైతే జీవాత్మ సంబంథమైన ఊపిరి కలిగిన ప్రాణులున్నామో ఆ ప్రాణం కలిగిన వాటికి ఆ ప్రాణంలోనే ఆత్మ లక్షణాలు
కూడా ఉంటాయి.  అందుచేత ఆ విధంగా రాయడం జరిగింది.  అయితే దానిని మనం ఇతర లేఖనాల కాంతిలో ఆలోచించి చూస్తే స్పష్టంగా వాటిలో ధనవంతుడు చనిపోయాక ఆత్మపోయి అగ్ని గుండంలో ఉన్నట్టు, లాజరు చనిపోయాక ఆత్మ అబ్రాహము రొమ్మున ఆనుకొని ఉన్నట్లు జంతువుల ఆత్మలు తర్వాత ఉండవు! అన్నట్లు తెలుస్తుంది.  అందుచేతనే జంతుహత్య పాపం కాదు, నరహత్య పాపం.  అదీ విషయం.