– అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు
జవాబు: అది నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధ స్థలములో నిలుచుట మీరు చూచిన తరువాత apply అవుతుందని యేసునాథుడే చెప్పాడు. మరి మత్తయి సువార్త 24:15వ వచనంలో చూసినట్టయితే అక్కడ ప్రభువారే చెబుతారు. “ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధ స్థలములో నిలుచుట మీరు చూడగానే యూదయలో ఉండు వారు కొండలకు పారిపోవాలి. అంటే యూదులకు ఇశ్రాయేలు జనాంగానికి సంబంధించిన విషయం అది. ఆ దినమున పొలములో ఉండువారు తమ బట్టలు తీసుకుపోవడానికి యింటికి రాకూడదు. మిద్దె మీద ఉండువాడు యింట్లో నుండి ఏమైనా తీసుకొని పోవడానికి దిగకూడదు. అయ్యో ఆ దినములలో గర్భిణులకు, పాలిచ్చు వారికి శ్రమ. మీరు పారిపోవుట చలికాలమందైన, విశ్రాంతి దినమందైన సంభవింపకూడదని ప్రార్థించుడి. పారిపోయే వాళ్ళెవరో చెప్పాడు 16లో యూదయలో ఉండువారు పారిపోతారు. గనుక వాళ్ళు పారిపోయేటప్పుడు అది చలికాలమైతే ఎక్కువ దూరము వారు పరుగెత్తి పారిపోలేరు. గర్భిణులైతే ఎక్కువ దూరం పారిపోలేరు. గనుక పారిపోవడమా తప్పదు. అయితే కొంచం పారిపోవడానికైన అనుకూలమైన సమయం ఉండాలని విశ్రాంతి దినమందు అయిన ఆ సంభవం రాకుండా మీరు రాకుండా ప్రార్ధన చేయమన్నాడు. ఎందుకంటే విశ్రాంతిదినమందు మైళ్ళు, రెండు మైళ్ళ కంటే ఎక్కువ దూరం (యూదులు) వీళ్ళు పోరు. ఎందుకంటే ఎక్కువ దూరం ప్రయణించొద్దు అనే అజ్ఞ ఉన్నది. భక్తి కలిగిన యూదులు అంతదూరం వెళ్ళరు. ఈ లోపల అబద్ధ క్రీస్తు సైన్యాలకు దొరికిపోతారు. ఊచకోతకోయబడతారు, గనుక అది రెండవ అర్థవారం ప్రవక్త దానియేలు ప్రవచించిన నాశనకరమైన హేయవస్తువు అంటే దానియేలు గ్రంథము 9:27 వ వచనంలో ఉన్నదామాట. అర్థవారమునకు నాశనకరమైనది నిలుచును. అంటే First half week లో ఏం జరగదు. అర్థవారం గడిచినాకా In the middle of the week వాడు అధికారంలోనికి వచ్చాక 3 1/2 సంవత్సరాలకి ఈ నాశనకరమైన వస్తువు నిలబడుతుంది. అప్పుడు యూదయలో ఉండువారు పారిపోతారు. గనక వాళ్ళకు చెబుతున్నాడనమాట That is the answer for this question.