16. ప్రశ్న : మిగతా సంఘాల, క్రైస్తవులకు, మాకు చాలా difference ఉంది అని మీరు చెప్పారు. ఆ difference ఏమిటి?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: మాకున్న విశిష్టత ఏమిటంటే ఏ డినామినేషన్ ని తృణీకరించము, లూథరన్, మెథడిస్ట్, బ్రదరన్, పెంతెకోస్తు, బాప్టిస్ట్ మనవాళ్లు, independents సంఘాలు మనవి Except యెహోవా సాక్షులు. ఎందుకంటే వారు యేసు ప్రభువు దేవుడే కాదంటారు గనుక అది తప్ప అన్ని సంఘాలలో నుండి దేవుని రాజ్యంలోకి వచ్చేవారు ఉంటారు. ఈ భూమ్మిద ఉన్నంత సేపు సిద్ధాంతపరంగా Minor differences ఉన్నప్పటికినీ, క్రీస్తు రక్తంలో తప్ప మనకు వేరొక పాపక్షమాపణ కలుగదని ప్రకటించడానికి జీవితం అంకితం చేసుకున్న వారందరూ భక్తులేనని మేము నమ్ముతాం. ఒక సంఘానికి కొంత వరకే ప్రత్యక్షత వచ్చింది, ఇంకో సంఘానికి ఒక మెట్టు ఎక్కువ, ఇంకో సంఘానికి ఇంకో మెట్టు ఎక్కువ అలాగ. కానీ సంపూర్ణతా అనేది ఎక్కడా లేదు. అన్ని సంఘాలూ చెప్పిన సత్యం నేర్చుకోవాలి. అప్పుడే మనం సంపూర్ణులం అవుతాం. అందుకే నేనూ, నా శిష్యులు అన్ని సంఘాలను గౌరవించి, నేర్చుకుంటారు. మాకున్న ప్రత్యేకత ఏమిటంటే అన్ని సంఘాలకు చెప్పడానికి మా దగ్గర ఒక పాఠం ఉంది. అందరిలో నుండి విశ్వ గురువైన యేసు నాకు నేర్పిస్తున్నాడు. అన్ని సంఘాలకు నాకు తెలిసిన సత్యం నేను నేర్పిస్తున్నాను. మేము ఒక్కళ్లమే ఎత్తబడే సంఘం అని నమ్మే సంఘం కాదు. Ophirism అంటే అన్ని సంఘాలలోనుండి గోధుమలు దేవునికి ఇష్టమైన యదార్ధవంతులు ఎత్తబడతారు. అందులో మనం ఉండాలి అనే బోధ. మనకు తెలిసింది చెప్పాలి తెలియంది నేర్చుకోవాలి. ఒకరికొకరు సహాయంచేసుకొని సంపూర్ణ సిద్ధిలోనికి వెళ్ళాలి. That is OPHIRISM ఎవరు చెప్పినా వింటాం కానీ లేఖన ఆధారం ఎక్కడ అని అడిగి అప్పుడు వింటాం. This is the speciality of OPHIRISM.