(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: వేద ఋషులు, ఆర్యులు ఖచ్చితంగా మధ్యప్రాచ్యం (Middle East) నుండి మన దేశానికి (ఉత్తర భారతదేశానికి) వలస వచ్చారు. ఆర్యులు ఇక్కడి వారే, భారతదేశపు వారే, వాళ్ళు ఎక్కడి నుండో రాలేదు, విదేశీయులు కాదు అని ఒక భయంకరమైన అసత్య ప్రచారం ఈ రోజుల్లో జరుగుతుంది. ఆర్యులు Indians కాదు ఇక్కడి వాళ్ళు కానే కాదు. వారు వలస వచ్చారు. ఇది వాస్తవం ఎందుకంటే Germany దేశస్థుడైన Hitler తాను ఆర్యుడు అని నమ్మేవాడు. మనము పవిత్రంగా ఎంచుకునే స్వస్తిక్ చిహ్నం నాజీ Party యొక్క చిహ్నం “స్వస్థిక్ చిహ్నం” Germany దేశస్థుడైన Hitler Germany జాతి ఆర్యులు అని నమ్మాడు. తరువాత ఇరాన్ దేశము క్రీస్తు పూర్వం వేల సంవత్సరాల నుండి అక్కడే ఉంది. అందరికి తెలుసు. బైబిల్ గ్రంథంలో కూడా పారాసీక దేశము అని ప్రస్తావించబడింది. అది పర్షియా ఈనాడు ఇరాన్ అయింది. మరి పారాసీక దేశము, పర్షియా పోయి ఇరాన్ ఎప్పుటి నుండి అయింది? అక్షర వాచస్పతి బిరుదాంచితులు దాశరధి రంగాచార్య గారు ఆయన రచించిన చతుర్వేద సంహిత ఆంధ్రానువాదంలో చెప్పారు ఉపోద్ఘాతంలో. ఏంటంటే ఆర్యన్ అనే పదమే మార్పు చెంది ఇరాన్ అయింది. భాషా శాస్త్రంలో Aryan became Iran. అందుచేత ఇరాన్ దేశస్థులు లేక ఆర్యన్, పర్షియా వాళ్ళు ఇప్పటికి మాట్లాడుతునటువంటి పారసిక దేశపు భాష మన పండిత భాష (సంస్కృతికి) చాలా దగ్గర పోలిక కలిగి ఉంటాయి. అక్కడి నుండి వలస వచ్చినవారు ఆర్యులు. ఇదంతా ఎందుకు చెబుతున్నాను. ఓంకారము గురించి అడిగితే ఎటెటో వెళ్ళి పోతున్నారు అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ విషయం ఏమిటంటే వేదములను దేవుని యొక్క ప్రత్యక్షత చేత కాని, తమ తపస్సు శక్తి సాధన చేత వాళ్ళు గ్రహించినటువంటి ఆ సాక్షాత్కారం వల్ల కాని, రాసినటువంటి వేదఋషులు, ఎక్కడి నుండి అయితే వచ్చారో ఆ దేశపు మతము పారసీక మతము. అక్కడ జరతుష్ట్ర మహర్షి అనే ఆయన ఉండేవాడు. ఈ జరుతుష్ట మహర్షి ఆయనను పాశ్చ్యాత దేశస్థులు (పశ్చిమ దేశస్థులు) నోరు తిరుగక జొరాష్టర్ అని పిలిచారు. ఈ జోరాష్ట్రర్ వాళ్ళ మతానికి మూల పురుషుడు. “జెండ్ అవేస్తా” అనే గ్రంథానికి ప్రవక్త , కర్త. ఈ “జెండ్ అవెస్తా” అనే గ్రంథము చెప్పేదేంటంటే “జొరాష్ట్రయానిజయ్”, ఇద్దరు దేవుండ్లు ఉన్నారు అని Ultimate forces, strongest forces, strongest spiritual forces concurring this world and this universe. We have two strong spiritual forces. ఒక్కడేమో “మంచి దేవుడు” ఒకడేమో “చెడ్డ దేవుడు”. Good God and the Bad God అని జరుతుష్ట్ర మహార్షి చెప్పాడు. ఇప్పుడు శబ్దదైవం దగ్గరికి వస్తే అసలు “ఓంకారము” అనేది దేవుని స్వరూపం అని మనం అనుకుంటున్నాము. కాని నాదబ్రహ్మాము అనేది వేరు ఓంకారము అనేది వేరు. తేడా ఉన్నది అని చెప్పినటువంటి హిందూ భారతీయ మహా పండితులు ఉన్నారు. వాళ్ళ వాదన ఎంటంటే “ఓం” “హ్లం” “క్లీం” అంటూ మంత్రాలన్నీ కూడా ఓంకారముతోనే ప్రారంభం అవుతాయి. చేతబడులు, మంత్రక్రియలు, అభిచార క్రియలు ఈ విధమైన నష్టదాయకమైన మంత్ర ప్రయోగాలు అన్నీ కూడా ఓంకారము తోనే ప్రారంభం అవుతాయి. ఓం తో ప్రారంభం కాని మంత్రం ఏది లేదు అంటారు మంత్రజ్ఞులు.
ఓంకారమే దైవస్వరూపం అయితే మరి మనుషులను నాశనం, పాడు చేసే ఈ అభిచార క్రియ “ఓం”తో ప్రారంభం కావడం ఏమిటి? సృష్టి ఆరంభంలో దేవుడు నాధస్వరూపుడుగా ఉన్నాడు అనే మాట సత్యమే కాని ఈ శబ్దాలు కూడా రెండు ఉన్నాయేమో అనే ఒక భావన (Concept) చాలా మంది పెద్దలు చెప్పారు నేనే కాదు.
ప్రణవము అనేది వేరు. దేవున్ని ప్రణవ స్వరూపుడు అంటారు. ఆ ప్రభావం నా మీద ఉంది కాబట్టే. నా దగ్గర ఉండే పిల్లలకు ప్రణవ్, ప్రణవి అని పేరు పెట్టాను. నాలో భారతీయత మొత్తం నరనరాన జీర్ణించుకున్నది. యేసు అని పలికినంత మాత్రన, యేసును ఆరాధించినంత మాత్రాన భారతీయత, జాతీయత నాకు లేదని అనుకునే వారు అమాయకులే. నాకు భయంకరమైన జాతీయ భావాలు ఉన్నాయి. British హాయాంలో నేను గనుక ఉంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని మించి fight చేసేవాన్ని అని ఎన్నోసార్లు కలలు కనేవాన్ని. ఇప్పటికి ఆ కల కంటున్నాను. అందుకే నేను ఒక Ground (Play ground) create చేసి నేతాజీ Sports Grounds అని పేరు పెట్టాను. అంటే అటువంటి జాతీయత భావం ఉంది.
ప్రణవము అనే దాని మీద నాకు చాలా గౌరవం కాని పెద్దలే లేవనెత్తిన ప్రశ్న “ఓం” అనేది ప్రణవము అయితే – ప్రణవము, ప్రణవ నాధం అనేది దైవస్వరూపం అయితే మరి మనుషులకు కీడు చేసే మంత్రాలు కూడా ఓంతో ఎందుకు ప్రారంభం అవుతున్నాయి అనేది ఒక చర్చనీయాంశము. అని చాలా మంది పెద్దలు నాతో చెప్పారు. అందుచేత నేను అనేది ఏంటంటే ఏదో ఒక శబ్దం అయితే దేవుని నోట్లో నుండి బయటకు వచ్చింది. గనుక అది ఓంకారమే అనే ఎందుకు అనుకుందాము ఝంకారము అందాం. గనుక Some kind of a melodious, powerful, divine, living sound. దేవుడు నోరు తెరిస్తే శబ్దం వచ్చింది. ఆ శబ్దము ఓంకారము కాదు అనలేము, ఓంకారమే అని చెప్పలేము ఎందుకంటే ఈ మీమాంస ఉంది. ఎందుకంటే మనుషులను పాడుచేసే అభిచార కర్మకాండ అంతటికి ఓం అనే శబ్దమే మొట్టమొదటి బీజాక్షారం అవుతుంది. అందుచేత “ఓంకారమా” నీకు స్తోత్రము అనే మాట క్రైస్తవుడిగా నేను అసలేను గానీ స్వామి వివేకానందులవారు అన్నారు “ఓంకారమే క్రీస్తు ఆయెను అని. గనుక నా వాదన ఏంటంటే ఓంకారమును భారతీయుందరు గౌరవిస్తున్నారు. ఓంకారమే క్రీస్తు అయ్యాడు అని పరబ్రహ్మా తత్వమును మనకు తెలియపరచుటకు ఓంకారమే క్రీస్తు ఆయెను అని చెప్పారు స్వామి వివేకానందులవారు. వారిని మనమందరము గౌరవిస్తున్నాం. వివేకానందులు మాకు ఇష్టమే కాని క్రీస్తు అంటే ఇష్టం లేదు అంటున్నారు. గనుక ఇది వితండ వాదం. అపసవ్యమైన ఆలోచన దోరణి మీరు అందరు ఆలోచించాలి. ఓంకారమే క్రీస్తు అని మీ గురువుగారే చెప్పారు. గనుక ఆయన మాట మీద ఏమైనా గౌరవం ఉంటే, ఓంకారమంటే మీకు గౌరవం ఉంటే యేసును మీరు ద్వేషించకూడదు. యేసును గూర్చి వాళ్ళు ఆలోచించడానికి అనుకూల వాతావరణం తీసుకురావడానికి, ద్వేషం అనేదాన్ని తొలగించడానికి నేను వివేకానందుల వారి పందాలో చెబుతున్నాను. క్రైస్తవులు కదా ఓంకారమా మీకు వందనాలు అనాలంటే 50% నాకు ఒక doubt ఉండి పోయింది. సగమే Okay అనుకుంటున్నాను. ఓంకారంని ఆరాధించొచ్చు అని సగం. పెద్దలు యిలాగ ఎందుకు అన్నారు? అభిచార కర్మకాండ ఓం తో ఎందుకు ప్రారంభం అవుతుంది? అని doubt ఉంది పోయింది. గనుక ఎందుకైనా మంచిది safe side, Addressing my prayers to “నాధబ్రహ్మ” rather than “ఓంకారము”. నేను దేవున్ని సంభోదించేటప్పుడు నాదబ్రహ్మామా అని పిలుస్తాను. ప్రణవ నాథమా అని పిలుస్తాను. అయితే ఓంకారమా అని పిలవడానికి ఒక 50% doubt ఉంది గనుక pending లో పెట్టాను. కాని ప్రణవము, నాథము కూడా వేదములలోవే. వేదములను వదిలేసి ఏం పోలేదు. వేదాలలో ఉన్న ప్రణవము, శబ్ద బ్రహ్మాము, నాథ బ్రహ్మాము అనే మాటలను సంతోషంగా వాడుకుంటున్నాను. స్తుతించడానికి ఆరాధించడానికి.