(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: దైవభక్తి సాధకులు, దైవాద్వేషకులందరు కూడా అడగవలసిన, ఆలోచించవలసిన ప్రశ్న. మొట్టమొదటి విషయం ఏంటంటే అసలు నజరేయుడైన యేసుగా, మరియ కుమారుడిగా మన మధ్యకు శరీరధారిగా వచ్చినటువంటి యేసునాధుడు అంతకుముందు కూడా చాలా సార్లు భూమి మీదికి వస్తూ ఉండినాడు. అనే concept చాలా మందికి ఒక కొత్త concept అది. చాలా మందికి అది తెలియదు. నాకు తెలిసి దాన్ని special emphasis (ప్రత్యేకమైన అంశం) గా నొక్కి చెబుతూ ఉండే సంఘం first Ophir Ministries International. ఎందుకు మనం అలా చెప్పామంటే మీకా 5:2లో “బేత్లహేము, ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను” దీన్ని Theological languages లో రెండు మాటలు వాడుతారు. ఎపిఫనీ అంటారు. అంటే దేవుని సాక్షాత్కారం దేవుడు కనబడుట. దేవుడు కనిపించే ఒక అనుభవం ఒక పక్రియ. ఆత్మరూపుడు అంతటా ఉంటాడు. ఈ చర్మ నేత్రము, మాంస నేత్రము చూడగలిగినటువంటి స్థితిలోపలికి ఆయన అప్పుడప్పుడు వస్తాడు. దాన్ని దర్శనం అంటారు. దేవుడు ప్రత్యక్షం అయ్యాడు అని. ఎపిఫనీ అని అంటారు. ఇంకొ Theological term ఉన్నది దాన్ని క్రిస్టోఫనీ అంటారు. అంటే ఖచ్చితంగా మరియ కుమారుడుగా వచ్చిన ఆ యేసే, దైవత్రిత్వంలోని రెండవ వ్యక్తి అయిన ఆ క్రీస్తు ఆయనే అని చెప్పగలిగేటువంటి ప్రత్యక్షతలను క్రిస్టోఫనీ అంటారు. So ఎపిఫీనీ, క్రిస్టోఫనీ అనే ఈ రెండు మాటలు దేవుడు మనుషులకు ఆయా కాలములలో ప్రత్యక్షమైన సందర్భాలు అలాంటి క్రిస్టోఫనీ మెల్కీసెదకు.
మెల్కీసెదెకు దగ్గర ఆయన ఎపిఫని చెప్పాలా! క్రిస్టోఫనీ చెప్పాలా! తండ్రియైన దేవుడిలా వచ్చాడా? లేదా కుమారుడైన దేవుడే కనబడేలా వచ్చాడా? అనే మీమాంస లేదు. మెల్కీసెదెకు was definitely a క్రిస్టోఫనీ. క్రీస్తు ప్రభువే ఎందుకంటే మెల్కీసెదెకు అబ్రాహముకు రొట్టెను ద్రాక్షారసమును ఇచ్చాడు. రెండు వేల సంవత్సరాల గడిచినాకా, ఆ సంభవం అయ్యాకా యేసుప్రభువారు మేడగదిలో ఆయన సిలువకు వేయబడిన ఆ రాత్రి, సిలువ మీదికి వెళ్ళక ముందు శిష్యులతో కలిసి పస్కాభోజనం ఆఖరి సారి చేస్తూ రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే నేనే ఆయనను గుర్తుపెట్టుకొండి. మీ మూలపురుషుడు అబ్రహాముకు రొట్టె ద్రాక్షారసము ఇచ్చింది నేనే. ఇదిగో మీకు ఇస్తున్నాను అనే సంగతి ప్రత్యక్షపరచడానికి యేసు ఆ కార్యాన్ని చేసాడు.
గనుక ఇక్కడ విషయం ఏంటంటే మెల్కీసెదెకుగా ఆయన వచ్చినప్పుడు కూడా ఆయన ఈ సర్వజ్ఞత, సర్వవ్యాపకత్వము, సర్వశక్తిమత్వము పోగొటుకున్నాడా అనే దానికి విషయం ఏంటంటే ప్రత్యక్షం అయినంత మాత్రాన ఇవ్వన్ని పోవాలని అవసరం ఏమి లేదు. అవతారము వేరు ప్రత్యక్షమగుట వేరు. ఈ technical theological difference and ఈ నిగూఢత అందరు అర్థం చేసుకోవాలి. ప్రత్యక్షమైనంత మాత్రనా దైవలక్షణాలు పోవాలని rule ఏమి లేదు. ఎందుకంటే దేవదూతలు కూడా అప్పుడప్పుడు ప్రత్యక్షమవుతుంటారు. కోట్ల, కోట్ల దేవదూతలలో గబ్రీయేలు, మిఖాయేలు ఇంకా ఎంతో కోట్ల దేవదూతలు మన చుట్టూ ఉంటారు దేవుని అనుజ్ఞతని బట్టి అప్పుడప్పుడు ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షం అయినప్పుడల్లా దేవదూతగా ఆయనకు ఉన్న మహిమంతా పొదుకదా! కాబట్టి తన మహిమనంత వదులుకొని రావలసినంత అవసరం ఎప్పుడొచ్చిందంటే అవతారము అయినప్పుడు. దేవదూత పేతురుకు కనబడ్డాడు, ఎలీషా, ఎలీషా పర్వతం చుట్టూ లక్షలాది దేవదూతలు ఉన్నారని చెప్పబడింది, దానియేలు దగ్గరకు, గెత్సమనే తోట దగ్గర యేసుప్రభు దగ్గరికే దేవదూత వచ్చి ముట్టి బలపరిచారు, పౌలు దగ్గరికి దేవదూత వచ్చి ధైర్యంగా సువార్త బోధించాలి అని చెప్పాడు. Number of times angels have appeared. But they did not loose their heavenly spiritual glorious attributes. Angelic attributes అనేవి. వాల్లేమి పోగొట్టుకునే అవసరం లేదు. అయితే యేసుప్రభువారు అవతరించుట అంటే కొంత కాలము మానవ పరిమితులకు లోబడి ఒక మానవ locationలో, human world లో human limitations లో కొంత కాలము బ్రతకాలి అనే ప్రక్రియ పేరే అవతారము. Incarnation వేరు appearance వేరు. కొంతమేరకు ఆ divine attributes కొంత వాళ్ళు sacrifice చేసి ఆ సమయంలో మెల్కీసెదెకు గా వచ్చినప్పుడు యాకోబు దగ్గరికి వచ్చి పెనుగులాడినప్పుడు అలాంటి సమయాల్లో కొంతమేరకు అయితే తన సర్వవ్యాపకత్వాన్ని ప్రక్కన పెడితే కదా యాకోబుతో పొరాడగలడు. సర్వాంతర్యామితో యాకోబు ఎలాగు పొరాడుతాడు? అసాధ్యం అసంభవము. అంతమాత్రానా ఆ స్థితికి వచ్చినంత మాత్రాన సర్వజ్ఞత పోయిందని చెప్పలేం. సర్వశక్తిమత్వం పోయిందని చెప్పలేం. ఇతనికి దొరకాలి గనుక వచ్చాడు.
ఆ ఒక్క attribute but not so with incarnation. Incarnation time లో మొత్తం ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు.
ఇక్కడే ఒక technical point ఏంటంటే, మీకా 5:2లో ఏమన్నాడంటే ఆయన పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము అనేక సందర్భాలో ఆయన ప్రత్యక్షమగుచూ వచ్చెను. ఎన్నిసార్లు ప్రత్యక్షమైనా ఆ సందర్భాంలో జరగని ఒక పక్రియ ఆయన మానవావతార సమయంలో జరిగింది. అదేమిటంటే తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఫిలిప్పీ 2:6లో చెబుతాడు “ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు” He emptied himself. This is the first time he really emptied himself never before – never earlier. ఇంతకుముందు రావడం జరిగింది. కానీ Emptying himself అనేది జరుగలేదు. ఇంతకు ముందు జరుగలేదు గనుకనే ఇప్పుడు జరిగింది అని చెప్పాల్సివచ్చింది అనేది నా point. తన్ను తాను రిక్తునిగా మొత్తం ఖాళి చేసుకొని వచ్చిన స్థితి అప్పుడు లేదు. గనుకనే ఇప్పుడు ఆయన ఖాళి చేసుకొని వచ్చాడు అని చెప్పవలసి వచ్చింది ఫిలిప్పీ పత్రికలో.