88. ప్రశ్న : ప్రభు రాత్రి భోజనం మా Church లో నెలకి ఒకసారి ఇస్తున్నారు. అయితే మీరు రాసిన ప్రభురాత్రి భోజన రహస్యం బుక్ లో మేము వారానికి ఒకసారి (Sunday) తీసుకొవాలని నేర్చుకున్నాము. దీన్ని గూర్చి ఏం చేయాలి సార్!

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: అడగండి మీ Pastor గారిని, request చేయండి. ప్రతివారం కావాలి అని, మీరు అడగినా ఇవ్వకపోతే దోషం వారి మీదికి వెళ్ళిపోతుంది. మీ మీద ఉండదు. దేవునికి అప్పగించి ఊరుకొండి. ప్రభువా నీ వాక్య ప్రకారం మేము ఒప్పించబడ్డాము. మీ దాసుడు రాసిన గ్రంథాన్ని బట్టి ఒప్పించబడ్డాము. మా స్థానిక కాపరేమో మరి మా మనవి ఆలకించడము లేదు. ప్రతి ఆదివారము బల్ల ఇవ్వడము లేదు. నీవే మాకు తీర్పు తీర్చు. నీవే పరిష్కారము చూపు అని ఏడ్చి ప్రార్థన చేయండి. స్థానిక నాయకునికి మారుమనస్సు అయినా వస్తుంది, తప్పు అయిన గ్రహిస్తాడు. లేకపోతే తన సంఘ క్షేమం కోసం అవసరం అనుకుంటే దేవుడు ఆయనను మహిమ లోకానికి తీసుకెళ్ళతాడు. ఇంకో కాపరిని పంపిస్తాడు. దేవుని చిత్తం. సంఘం అనేది Primary Concern మనకు. మనుషులు కాదు. సంఘం ముఖ్యం మనిషి ముఖ్యం కాదు. క్షేమాభివృద్ధికరంగా pastors అందరు ఉండాలి. లేకపోతే Pastors ని దేవుడు ఆశీర్వదించి మహిమ లోకానికి తీసుకెళ్ళతాడు.