623.ప్రశ్న (KSM 247): 💇 నాజీరు చేయబడిన ఇది ఉంది కదండీ సంసోన్ కి… జుట్టు కత్తిరించిన తర్వాత ఆ ప్రభావం అతని నుంచి వెళ్ళిపోవడం అనేది ఏంటి?

Link: https://youtu.be/a9IlAHYmmPk?t=4960

దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

  • సంఖ్యాకాండము 6:1-21 లో చెప్పబడిన నాజీరు వ్రతము, ఎవరికి వారే తమంతట తాము దేవునికి ప్రతిష్టించుకునేది. వాళ్ళు ఒక నెల, 40 రోజులు లేదా 80 రోజులు అని దినాలు లెక్క పెట్టుకుని, ఆ కాలంలో తలమీద మంగళకత్తి పడనీయరు. 🗓️
  • కానీ సంసోను విషయం స్పెషల్ కేసు. న్యాయాధిపతులు 13:7 ప్రకారం, అతడు తన తల్లి గర్భమున పుట్టింది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడు. దేవుడే అతన్ని జన్మాంతం నాజీరుగా ఉండాలని నిర్ణయించాడు (అతనికి దినాల లెక్క లేదు). 👶
  • న్యాయాధిపతులు 16:17 లో సంసోను దెలీలాతో “నా తల మీదకి మంగళకత్తి రాలేదు, నాకు క్షవరము చేసిన యెడల నా బలము నాలో నుండి తొలగిపోవును” అని తన రహస్యం చెప్పాడు. ✂️
  • దేవుడు నియమించిన ఆ నిబంధనను సంసోను మీరాడు గనుక, ఆ ప్రభావం (బలం) అతనిలో నుండి వెళ్ళిపోయింది. అతడు ప్రాణము విసిగిపోయి ‘చావగోరి’ ఆ నిర్ణయం తీసుకున్నాడు. 💔

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram