655.ప్రశ్న (KSM 245): 👥 (కాలర్ జకరియా): “1 కోరింథీ 15:6 లో 500 మందికి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే (యేసు) కనబడింది అని ఉంది… ఈ గుంపు ఒక దగ్గర కాకుండా వేరు వేరే ప్లేస్లో ఉంటే కనబడదా ఒక డౌట్ సార్?” (06m 38s)

Link: https://youtu.be/Jcjjnq2IHH0?t=4368

దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

  • 👥 అప్పట్లో దేవుని సంఘము ‘రహస్య సంఘముగా’ ఉండేది. ఎందుకంటే వాళ్ళంతా యూదులకు భయపడి ఒకచోట రహస్యంగా కూడుకున్నారు.
  • 🚪 దీనికి ఆధారం యోహాను సువార్త 20:19. “ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని చెప్పెను”. యూదులకు దొరికితే రోమా ప్రభుత్వానికి అప్పగిస్తారనే భయంతో వాళ్ళు లోపల తలుపులు మూసుకున్నారు.
  • 🤔 అయితే యేసుప్రభువు 500 మందికి వేర్వేరు చోట్ల కాకుండా, ఒకేసారి (ఒకే దగ్గర) ఎందుకు కనపడాల్సి వచ్చింది? ఎందుకంటే, ఆయన ముందుగా మగ్దలేని మరియకు కనబడితే, సాక్షాత్తూ ఆయన శిష్యులే ఆమెను నమ్మలేదు. “చచ్చిపోయిన వాడు లేవడం ఏంటి పిచ్చిదానా? నీకు కల వచ్చిందా?” అని ఆమెను తృణీకరించారు.
  • 🖐️ ఆ తర్వాత 10 మంది శిష్యులకు కనబడినప్పుడు, ఆ సమయంలో అక్కడ లేని ‘తోమా’ వచ్చి “నేను ఆయన చేతుల్లో మేకుల గురుతును చూసి, నా వ్రేలు అందులో పెడితేనే గానీ నమ్మను” అన్నాడు (యోహాను 20:24-25).
  • 🌍 పది మంది శిష్యులు ఒక్కసారే చూసి చెప్పినా కూడా తోమా నమ్మలేదు. సమాజంలో ఇటువంటి నమ్మని ‘తోమా’లు ఒక్కడే కాదు, ఇంకా చాలామంది ఉంటారు.
  • 🗣️ ఒకవేళ యేసుప్రభువు ఆ 500 మందికి వేర్వేరు చోట్ల ఒక్కొక్కరికి కనబడితే, వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పినప్పుడు మగ్దలేని మరియను అన్నట్టుగానే “అరె నీకు భ్రమ కలిగిందిరా, కల వచ్చిందిరా” అని మిగతా వాళ్ళు కొట్టిపారేసేవారు.
  • 😲 కాబట్టే ఎవడూ కాదనడానికి వీలు లేకుండా, ఆ 500 మంది ఒకచోట కూడి ఉన్నప్పుడే యేసుప్రభువు వారికి కనబడ్డాడు. “ఏరా 500 మందికి ఒకటే కల వస్తదా ఎక్కడైనా?” అని నమ్మనివాడినే పిచ్చోడిని చేసేటట్టుగా దేవుడు ఈ అద్భుతం చేశాడు!
  • ❌ కొంతమంది వ్యాఖ్యానకర్తలు (Commentators) ఆయన వేర్వేరు చోట్ల ఉన్న 500 మందికి కనబడ్డాడని చెబుతారు, కానీ అది వాస్తవం కాదు. ఎవరూ ఈ పునరుత్థాన సాక్ష్యాన్ని కొట్టిపారేయకుండా ఉండేందుకే, అందరూ ఒకే దగ్గర ఉన్నప్పుడు ఆయన దర్శనమిచ్చాడు.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram