7 ప్రశ్న : ఆత్మీయ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి? ఉన్నతమైన అంతస్తులోనికి ఎలా ఎదగాలి?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు: రక్షణ పొందిన తర్వాత యేసును మన హృదయంలో రాజుగా, ఏలికగా ప్రతిష్టించుకుంటాము. యేసు ప్రభుతో personal attachment start అవుతుంది. తర్వాత మన రక్షకునితో మాట్లాడాలి అనే తహతహ ప్రారంభం అవుతుంది. అదే ప్రార్థనా జీవితానికి దారి తీస్తుంది. రక్షకుడు మాట్లాడే మాటలు మనకు తెలియాలి అంటే లేఖనం చదవాలనే దాహం పుడుతుంది. దావీదు ప్రార్ధన చేయాలని, దివారాత్రములు వాక్యం ధ్యానించాలని దాహం కలిగి యుండే వాడు, భక్తులందరూ కలిగి యుండేవారు. గనుక మనం ఈ రెండూ చేయాలి. ఈ రెండూ చేస్తునప్పుడు, ఆత్మీయ జీవితాన్ని కట్టుకునేటప్పుడు మొదటి శతాబ్దములోని క్రైస్తవులు ఎలా నడిచారో అపోస్తలుల కార్యముల గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడింది. వారు ఎలాంటి activities లో ఉన్నారో అలాంటి activities మనం చేయాలి. వారు అపోస్తలులు బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుటలో, ప్రార్ధన చేయటంలో కొనసాగినట్లు వారిని అనుకరించాలి అనే ఆశ మనలో మొదలవుతుంది. ఆ మార్గంలో నడుస్తాం. తర్వాత యేసు ప్రభు నియమించిన అపోస్తులుల యొక్క పత్రికలున్నవి. వాళ్లు పత్రికలలో ప్రవర్తన ద్వారా, నోటి మాట ద్వారా, వారు ఇచ్చిన ఉపదేశాన్ని పాటిస్తాం. ఈ మార్గంలో నడుస్తున్న కొద్దీ మనలో ఉన్న పరిశుద్దాత్మ దేవుడు మనల్ని పై అంతస్తుకు ఎక్కిస్తూ ఉంటాడు. అది automatic గా జరిగే విషయం. మనం మనకు తెలియకుండానే చిన్న నుండి పెద్దవాళ్లంగా అయినట్టు, ఈ ఆత్మీయ కార్యాలు కూడా మనకు తెలియకుండానే మనం సంపూర్ణ సిద్ధిలోనికి వెళ్లిపోతాం. అయితే మన ఆత్మీయ జీవితం సరిగ్గాలేదు అని ఎప్పుడు తెలుస్తుందంటే ప్రార్ధన, సహవాసం, అపోస్తలుల బోధ, రొట్టె విరచుట వీటిలో దేని గూర్చియైన మనకు విముఖత ఏర్పడితే తప్పకుండా మన ఆత్మీయ ఆరోగ్యం చెడిపోయినట్టే లెక్క. ఆరోగ్యవంతుడైన క్రైస్తవుడు పౌలులాగా ఉంటాడు. పౌలు యొక్క ఆలోచన, సిద్దాంతానికి వేరుగా మనం, ఆలోచించినప్పుడు definite గా మనకు ఆత్మీయరోగం వచ్చినట్టు లెక్క మనం దానికి చికిత్స చేసుకోవాలి.