17. ప్రశ్న: బైబిల్లో అనేక ఉపమానాలు ఉండగా, ఎన్నో సంగతులు యేసును గూర్చి చూపెట్టాల్సినవి ఉండగా. కానీ మీరు వేదాలలోనుండి తీసుకొని, అందులో ఉన్న ఉపమానాలను తీసుకొని చెప్పాల్సిన అవసరం ఏమిటి? అవి లేకుండా వారికి యేసుని ప్రకటించలేమా?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: బైబిల్ లో ఉన్న ఉపమానాలు ఆధారాలు తీసుకొని క్రీస్తును ప్రకటిస్తే బైబిల్ అంటే ఇష్టం లేనివాడు, ద్వేషం పెంచుకున్నవాడు ఎందుకు అంగీకరిస్తాడు? ఇది అంటరాని, అస్పృశ్యుల గ్రంథము, British వాళ్ల గ్రంథము అని దీని చూస్తేనే మనస్సు నిండా ద్వేషం పెంచుకున్న తర్వాత “సోదరుడా బైబిల్ గ్రంథం ఇలా చెప్పుచున్నది”. అంటే వాడి ప్రతిస్పందన ఎలా ఉంటుంది?. వాడికి అసహ్యమైన గ్రంథం నుండి ఎలా ఒక సత్యాన్ని చెబుతాము? గనుక బైబిల్ అంటే ఏ మాత్రం ఇష్టం లేనివాడు కూడా నా కొరకు దేవుడు మరణించి లేచాడు అనే సత్యాన్ని వినాలి. ఏ గ్రంథం నుండి చెప్తున్నామో ఆ గ్రంథం మీద అతనికి ద్వేషం ఉండకూడదు. ఎలాగైనా అతడు రక్షణ పొందాలని “నీకు వేదమంటే ఇష్టం కదా నీవు ఆలోచించు” అని ఆలోచించాలని ఆ బుక్ రాసాను. బైబిల్ని నమ్మిన వారి కొరకు నేను “హైందవ క్రైస్తవం” రాయలేదు. బైబిల్ అంటే ఇష్టం లేకుండా వేదమే ప్రామాణికం అనుకున్న వారికి చాలా పొడవైన సువార్త కరపత్రిక “హైందవ క్రైస్తవం”.