-అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు
జవాబు: అక్కడ దానియేలు ఎందుకు వద్దన్నాడో కూడా అక్కడ తేటగా చెప్పబడింది. దానియేలు 1:12వ వచనం “భోజనమునకు శాఖదాన్యాధులను, పానమునకు నీళ్ళను మీ దాసులమగు మాకిప్పించి దయచేసి పది దినముల వరకు మమ్మును పరీక్షింపుము. ఇది పదిరోజుల వరకైనటువంటి పరీక్షకాలమది. ఎందుకు అంటే వీళ్ళను చెరగా తీసుకొనిపోయారు గదా! వీళ్ళు రాజుకు సేవ చేయాలి. రాజ అంతఃపురంలో వుండాలి. రాజ దర్బారులో ఉండాలి. వాళ్ళకున్న Talent లను బట్టి వాళ్ళకు రకరకాల పనులు అప్పచెపుతారు. అయితే రాజ పరిచర్యలో, రాజు యొక్క సేవలో, రాజ భవనంలో ఉండవల్సిన వీళ్ళు చాలా healthyగా ఆరోగ్యంగా, బలంగా ఉండాలి. ఈ సురోమంటూ నీరస పక్షులులాగా ఉండొద్దు. అందుచేత రాజుగారు రాజభోజనం, ఆ దేశం యొక్క రాజభోజనం వాళ్ళకు పెడతాడు. అయితే ఆ దేశంలో రాజభోజనం అంటే ఏమిటి? ధర్మశాస్త్రంలో దేవుడు ఏది వద్దని నిషేధించిన కొన్ని జంతువులు వారు పెడతారు. యిప్పుడు ప్రాతఃకాలము Persian ఆహారము ఏంటంటే కుక్కను కూడా తిన్నారు వారు. యిప్పుడు కూడా కుక్కను చాలామంది తింటారు Nagaland వాళ్ళు తింటారు. Indonesia వాళ్ళు తింటారు. మరి అది తినకూడదు యూదులు. గనుక అటువంటివి ఈ కుక్క ఒకటి, పంది ఒకటి, కోతి ఒకటి. కోతులను తినేవారు ఉన్నారు. అసలు తిననిదేమి లేదు. గబ్బిలాలను తింటారు. అన్నిటిని తింటారు. తొండలను, బల్లులను, ఎలుకలను, పాములను, కప్పలను మరి యివన్నీ యూదుడుగా తాను తినగూడదు కదా! అయితే మేము అలాంటి ఆహార పదార్థాలు తీసుకొని మేము అపవిత్రులము కాలేమండి దానియేలు 1:8లో దానియేలు చెప్పాడు. అప్పుడూ ఆ నపుంసకుల అధిపతి ఏంచేసాడంటే మీకు అన్నపానములు నియమించిన రాజగు నా యజమానునికి నేను భయపడుచున్నాను బాబు. మీరు చెప్పిన Point బాగానే ఉందిగాని రాజుగారు గుర్తు వస్తే భయమేస్తుంది. మీరు మాములుగా శాఖాహారం తింటే మరి మిగితావాళ్ళందరు మంచి Non-Vegetarian food తింటే వాళ్లు బాగా నిగనిగలాడుతూ ఉంటారు. మీరేమో నీరసంగా ఉంటారు. రాజుగారు నా తల తీయించేస్తారు. ఎందుకు వాళ్ళను నువ్వు తక్కువ చూపు చూసావు. సరిగ్గా పోషించలేదని అంటాడు. నాకు భయమేస్తుంది అంటే అప్పుడన్నడనమాట సరే పదిరోజులవరకు పరీక్షించండి. మీరసుకునటువంటి మంచి రుచికరమైన, బలవర్ధకమైన Nourishing food అంతా వాళ్ళకందరికి యివ్వండీ, మాకు నలుగురికి మాత్రం బట్టి Vegetarian food – శాఖదాన్యములు త్రాగడానికి ఎలాంటి పళ్ళరసాలు వద్దు only water వట్టి నీళ్ళే తాగుతాము. కాయగూరలు తింటాము. పదిరోజుల లోపల వాళ్ళకు మాకు తేడా మీరు చూడమన్నాడు. అప్పుడు ఆ పదిరోజులయ్యాకా పరీక్షిస్తే 13వ వచనంలో పిమ్మట మా ముఖములను, రాజు నియమించు భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీదాసులమైన మా యెడల జరిగింపుము. అందులకతడు ఈ విషయములో వారి మాటకు సమ్మతించి పది దినముల వరకు వారిని పరీక్షించెను. పది దినములైన పిమ్మట వారి ముఖములు, రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యము గాను, కళగాను కనబడగా, ఆ… బాలురందరి, రాజ భోజనం భుజించే వాళ్ళందరికంటే వీళ్ళ ముఖాలు సౌందర్యంగా, కళగా తేజస్సుతో కనబడ్డాయి, అక్కడ ఆ సందర్భమది. ఆ తరువాత యిక ద్రాక్షారసము అనేది పెద్ద subject అది. యిప్పటికి కూడా ద్రాక్షారసం నేను త్రాగుతాను Which is not alcoholic. Grape juice – Fresh grape juice is very good even according to ayurvedic science.ఆయుర్వేదం ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే ద్రాక్షారసం మన liverకు చాలా మంచిది. మన జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. రక్తవృద్ధి, రక్తశుద్ధి కలుగిస్తుంది. మరి పళ్ళరసములన్ని కుళ్ళేదాకా చేసి దాని alcoholicగా చేసేదే Beer. ఇటువంటివి ఉన్నాయి. గనుక Limited level లో దాన్ని తీసుకోవాలి. ఆ రోజుల్లో రాజ్యాధికారం చేసి వారికి ఈ అలవాటు ఉండెది. కొంతమందికి limitedగా alcoholic wine కూడా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. Limited గా Beer తీసుకోవడం మంచిది అని చెప్పే Doctors కూడా ఉన్నారు. అయితే నేను దాన్ని Advocate చేయటం లేదు యిప్పుడు. వాళ్ళు అవన్నీ తీసుకున్నదానికంటే ఉట్టి మంచినీరు తీసుకుంటేనే దానియేలుకు మంచి ఆరోగ్యం వచ్చింది. దేవుడు ఆశీర్వదించాలి గాని దానికి మనకు alcoholic drinks మనకు అవసరం లేదు. అయితే రాజమర్యాదలు, రాజ భోజనంలో భాగంగా ఒక limit గా వాళ్ళు ఆయనకు serve చేసి ఉంటారు. అదొక option లేకుంటే it may be a fresh grape juice also. అది కూడా అయి ఉండొచ్చు. మరి దానియేలు ఏది తీసుకున్నాడు. అనేది వేరు. తరువాత Whether it is a limited wine or it is a fresh grape juice ఎప్పుడు మొదలు పెట్టాడంటే ఈ పది దినములలో తెలిసిపోయింది. వీళ్ళు అడిగింది వీళ్ళకు యిద్దాము. రాజు నియమించింది అక్కరలేదు. వాళ్ళ ఆరోగ్యాలు, వాళ్ళ భక్తి మీద ఆధారపడి ఉన్నాయి, In take of food మీద ఆధారాపడి లేదు. అని అతను decide అయిపోయినాకా they felt free అన్నమాట.