710.ప్రశ్న (KSM 241): 📖 “నిర్గమ 23:20 ప్రకారం ‘ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను’ అని యెహోవా ఎందుకు చెప్పారు? ఆ దూత ఎవరు?” (02m 31s)

Link: https://www.youtube.com/live/dorsIQG8SOs?t=1587

దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

  • 🕊️ రెండవ యెహోవా పరిచయం: సీనాయి కొండ దగ్గర నుండి కనాను దేశం దాకా ఇశ్రాయేలీయులను నడిపించినది కుమారుడైన యెహోవా. తండ్రి అయిన యెహోవా ఇక్కడ ఒక ‘దూత’ను (Angel of the Lord) పరిచయం చేస్తూ—”ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండుడి, ఆయన మాట వినవలెను, ఆయనకు కోపం రేపవద్దు.. నా నామము ఆయనకు ఉన్నది” అని చెప్పారు.
  • నా నామము ఆయనకు ఉన్నది: ఇక్కడ తండ్రి పేరు ‘యెహోవా’, కుమారుడి పేరు కూడా ‘యెహోవా’. అందుకే తండ్రి అయిన దేవుడు తన నామము ఆయనకు ఉన్నదని సాక్ష్యమిచ్చారు. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానంలో ఇద్దరు యెహోవాల గురించి నేను స్పష్టంగా వివరించాను.
  • 🛡️ సందేశం: తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఒక దూత రూపంలో పంపి, ఇశ్రాయేలీయులను కనానుకు నడిపించారు. ఆయన మాట వినకపోతే ఆయన అతిక్రమములను పరిహరించడు అని తండ్రి హెచ్చరించారు.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram