Link: https://www.youtube.com/live/dorsIQG8SOs?t=3752
దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:
- ⛓️ నిరర్థకం చేయడం అంటే?: ఆయనే చెబుతాడు అక్కడ.. ఎలా నిరర్ధకము చేయడు అని అంటే.. “నీతి ధర్మశాస్త్రము వలననైతే” దేవుని కృప నిరర్థకమే కదా. నేను ఇంకా ధర్మశాస్త్రము వలననే నీతిమంతునిగా ఎంచబడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, దేవుని కృపను నేను వ్యర్థమైనదిగా ఎంచినట్లే. అది ఆయన పాయింట్.
- 📜 కర్మకాండలు: ధర్మశాస్త్రము ద్వారా, ఆచార వ్యవహారాలు, కర్మకాండల ద్వారా, ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి పద్ధతుల ద్వారా నేను నీతిమంతునిగా నిలబడతాను అనుకుంటే దేవుని కృపను నేను నిరర్థకం చేసినట్లే అని ఆయన చెబుతున్నాడు.
- 🚫 క్రీస్తు నుండి వేరుచేయబడటం: అదే మాట ఆయన మళ్ళీ రిపీట్ చేస్తాడు గలతీ 5:4లో—”మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడగోరువారు ఎవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు”.
- 🛡️ సందేశం: మళ్లా నేను సున్నతి పొందుతాను, విశ్రాంతి దినం పాటిస్తాను, ఆ మాంసం తినను, ఈ మాంసం తింటాను అని.. దీని మీదనే ఆధారపడి దేవుడు నన్ను నీతిమంతుడిగా క్వాలిఫై చేస్తాడు అని అనుకునే వాళ్ళందరూ కూడా కృపలో నుండి వేరు చేయబడ్డారు, క్రీస్తులో నుండి బయటికి వెళ్ళిపోయినట్టే లెక్క. క్రీస్తునందు ఉన్నవాడికి ఈ విధులు ఉండవు, క్రీస్తు మాత్రమే మన నీతి అనే విషయాన్ని గలతీ పత్రిక ఎంఫసైజ్ చేస్తోంది.
